PAN- Aadhaar Linking: ఈ సంగతి మీకు తెలుసా.. పాన్‌ను ఆధార్‌‌తో లింక్ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..

|

Mar 08, 2023 | 4:11 PM

పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31. ఇలాంటి సమయంలో దాని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

PAN- Aadhaar Linking: ఈ సంగతి మీకు తెలుసా.. పాన్‌ను ఆధార్‌‌తో లింక్ చేయడం వల్ల బోలెడు ప్రయోజనాలు.. అవేంటంటే..
Aadhaar Pan Card
Follow us on

మన దేశంలో ముఖ్యమైన పత్రాల్లో ఒకటైనది ఆధార్‌. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి, అలాగే బ్యాంకు లావాదేవీల్లో ముఖ్యమైన పత్రాల్లో పాన్‌ కార్డు. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు విషయంలో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే సూచిస్తోంది. ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా పొడిగిస్తూ వస్తోంది. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఇప్పటికే తెలిపింది. మీ బ్యాంకు ఖాతా స్థంభించిపోతుంది. దీంతో లావాదేవీలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

అంతేకాదు పాన్‌ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే ముందుగా ఆధార్‌తో లింక్‌ చేసి ఉండాలి. పాన్‌ అనుసంధానం ఈ గడువు మార్చి 31, 2023 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. గడువు పెంచినా.. ఏప్రిల్ 1, 2022 నుంచి మీరు మీ పాన్‌ని ఆధార్‌తో లింక్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్చి 29, 2022 నాటి నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు పొడిగించబడింది. దీని తర్వాత ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ లింక్ చేయబడదు. ప్రస్తుతం పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు రూ.1000 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

మీరు మార్చి 31లోపు ఆధార్- పాన్‌లను లింక్ చేస్తే, మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు, మీరు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే, మీ పాన్ కార్డ్ నిష్క్రియంగా మారుతుంది.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం విషయానికి వస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతాలను తెరవడానికి ఈ రెండూ KYCకి ముఖ్యమైనవి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని కింద లభించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఈ ప్రయోజనాలు మీకు తెలియదా?

  • అన్ని లావాదేవీలకు ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం. ఆధార్- పాన్ లింక్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖకు అన్ని లావాదేవీల ఆడిట్ ట్రయల్ లభిస్తుంది.
  • మీ ఆధార్-పాన్ లింక్ అయ్యే వరకు ITR ఫైలింగ్ అనుమతించబడదు.
  • లింక్ చేసిన తర్వాత, రసీదు లేదా ఇ-సంతకం సమర్పించాల్సిన అవసరం లేకుండా పోతుంది. కాబట్టి ITR ఫైల్ చేయడం సులభం అవుతుంది.
  • ఆధార్ కార్డు వినియోగం వల్ల ఇతర పత్రాల అవసరం చాలా వరకు తగ్గింది.
  • ఆధార్ కార్డ్ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
  • లింక్ చేసిన తర్వాత లావాదేవీలను ట్రాక్ చేయవచ్చు.
  • ఆధార్-పాన్ లింక్ చేయడం వల్ల మోసం జరుగుతుందనే సమస్యకు పరిష్కారం లభించినట్లే.. పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. దీంతో దేశ ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారిగా దారిలో పడుతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం