Paytm: పేటీఎమ్‌ నుంచి మీ అకౌంట్‌కు మీరే డబ్బులు ఎలా పంపించుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి.

|

Dec 24, 2022 | 5:51 PM

డిజిటల్ పేమెంట్స్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావా దేవీలు చాలా సులభంగా మారిపోయాయి. ఒకప్పుడు ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు పంపుకోవాలంటే బ్యాంకు వెళ్లి, ఫామ్‌ నింపి, లైన్‌లో నిల్చోవడం ఇలా పెద్ద తతంగం ఉండేది...

Paytm: పేటీఎమ్‌ నుంచి మీ అకౌంట్‌కు మీరే డబ్బులు ఎలా పంపించుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అవ్వండి.
Paytm
Follow us on

డిజిటల్ పేమెంట్స్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావా దేవీలు చాలా సులభంగా మారిపోయాయి. ఒకప్పుడు ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు పంపుకోవాలంటే బ్యాంకు వెళ్లి, ఫామ్‌ నింపి, లైన్‌లో నిల్చోవడం ఇలా పెద్ద తతంగం ఉండేది. కానీ ప్రస్తుతం రోజులు మారిపోయాయి, ఎప్పుడైతే డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ వచ్చాయో క్షణాల్లో డబ్బు ట్రాన్సర్‌ అవుతోంది. ఒక సింగిల్‌ క్లిక్‌తో ప్రపంచంలో ఎక్కడున్న వారికైనా సరే డబ్బులు పంపించుకునే వెసులుబాటు దక్కింది.

ఇదిలా ఉంటే ఎదుటి వారి అకౌంట్‌కి డబ్బులు ఎలా పంపాలో అందరికీ తెలిసే ఉంటుంది. మరి మీ సొంతం అకౌంట్‌కు వేరే అకౌంట్‌ నుంచి డబ్బులు ఎలా పంపించుకోవాలో తెలుసా.? ఉదాహరణకు మీకు ఎస్‌బీఐ, ఐసీఐసీ బ్యాంకులకు చెందిన రెండు అకౌంట్లు ఉన్నాయనుకుందాం. ఎస్‌బీఐలో ఉన్న డబ్బును ఐసీఐసీలకి ట్రాన్సర్‌ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి స్టెప్స్‌ ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. పేటీఎమ్‌ యాప్‌లో మీ సొంత ఖాతాకు డబ్బులు ఎలా పంపించుకోవాలో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..

* మొదట పేటీఎమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి అనంతరం ‘సెండ్‌ మనీ’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ‘టు సెల్ఫ్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత పేటీఎమ్‌కు లింక్‌ చేసిన మీ అన్ని బ్యాంక్‌ ఖాతాలు కనిపిస్తాయి.

* మొదట మీరు డబ్బులు పంపాలనుకుంటున్న అకౌంట్‌ను సెలక్ చేసుకోవాలి.

* అనంతరం పంపాలనుకునే మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి.

* తర్వాత మీరు ఏ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌ను ఎంచుకోవాలి.

* చివరిగా ‘పే’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి యూపీఐ పిన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేస్తే సరి వెంటనే మీరు కోరుకున్న ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..