AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Detection: బంగారు నిల్వలను ఎలా తనిఖీ చేస్తారో తెలుసా? నిపుణులు పాటించే పద్ధతులు ఇవే..!

బంగారం అనేది చాలా విలువైన లోహం. ముఖ్యంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితులు కారణంగా నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా బంగారం నిలిచింది. అయితే ఇటీవల పాకిస్తాన్‌లోని సింధు నదిలో రూ.80 వేల కోట్ల విలువైన బంగారు నిల్వలు కనుగొన్నారనే వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అయితే సగటు మనిషికి నిజంగా బంగారు నిల్వలను శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారు? అనే అనుమానం ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారాన్ని అన్వేషించే పద్ధతుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Gold Detection: బంగారు నిల్వలను ఎలా తనిఖీ చేస్తారో తెలుసా? నిపుణులు పాటించే పద్ధతులు ఇవే..!
Gold Mines
Nikhil
|

Updated on: Mar 12, 2025 | 5:15 PM

Share

శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బంగారం నిల్వలను ఎలా కనుగొంటారు? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. భూమి లోపల దాగి ఉన్న నిధులను గుర్తించడానికి ప్రత్యేక పరికరాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భూగర్భంలో బంగారాన్ని గుర్తించడానికి ప్రధానంగా మూడు పద్ధతులు ఉపయోగిస్తారని వివరిస్తున్నారు.

గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ 

ఈ సాంకేతికత భూమి ఉపరితలం కింద ఉన్న నిర్మాణాలను చిత్రీకరించడానికి రాడార్ సిగ్నల్‌లను ఉపయోగిస్తుంది. జీపీఆర్ పెద్ద యంత్రాల్లో ఉపయోగిస్తారు. భూగర్భలోని వస్తువులను కచ్చితంగా గుర్తిస్తుంది.

వెరీ లో ఫ్రీక్వెన్సీ

ఈ సాంకేతికత తక్కువ పౌనఃపున్యంతో విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగిస్తుంది. వీఎల్ఎఫ్ టెక్నాలజీని చిన్న యంత్రాలలో ఉపయోగిస్తారు. ఉపరితలానికి దగ్గరగా ఉన్న లోహాలను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

విద్యుదయస్కాంత శక్తి

ఈ సాంకేతికత విద్యుదయస్కాంత తరంగాల ద్వారా లోహాలను గుర్తిస్తుంది. ఈ సాంకేతికత భూమి ఉపరితలం కింద లోహాలను గుర్తించవచ్చు. చేతితో పనిచేసే బంగారు డిటెక్టర్ యంత్రాల్లో విరివిగా ఈ టెక్నాలజీను ఉపయోగిస్తారు 

గోల్డ్ డిటెక్టర్ యంత్రాలు, లక్షణాలు, ధర

గోల్డ్ డిటెక్టర్ యంత్రాలు విద్యుదయస్కాంత సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. ఒక నిర్దిష్ట పరిధిని కలిగి ఉంటాయి. ఇది యంత్రం బంగారాన్ని ఎంత లోతు వరకు గుర్తించగలదో? నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఒక గోల్డ్ డిటెక్టర్ యంత్రం 20 అడుగుల పరిధి ఉంటే ఈ యంత్రం భూమిలో 20 అడుగుల లోతులో పాతిపెట్టిన బంగారాన్ని గుర్తిస్తుంది. ఈ యంత్రాల ధర వాటి నాణ్యత, లోతు సామర్థ్యాన్ని బట్టి మారుతుంది. వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేయగల చిన్న యంత్రాల ధర దాదాపు రూ.70,000 నుండి రూ.1.5 లక్షల వరకు ఉంటుంది. ఎక్కువ లోతుల్లో బంగారాన్ని గుర్తించగల అధునాతన యంత్రాల ధర దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది.

కొనుగోలు ఇలా

గోల్డ్ డిటెక్టర్ యంత్రాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో వివిధ మోడళ్ల లభ్యత ఉంది. ఇక్కడ మీరు మీ అవసరాలు మరియు బడ్జెట్ ప్రకారం యంత్రాన్ని ఎంచుకోవచ్చు. కొనుగోలు చేసే ముందు యంత్రం యొక్క లక్షణాలు, లోతు సామర్థ్యం, వినియోగదారు మాన్యువల్‌ను పరిశీలించడం ముఖ్యం. బంగారాన్ని అన్వేషించడానికి, తవ్వడానికి చట్టపరమైన అనుమతులు అవసరం కావచ్చు. కాబట్టి ఏదైనా అన్వేషణ లేదా తవ్వకం చేసే ముందు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారాన్ని అన్వేషించేటప్పుడు పర్యావరణ ప్రమాణాలను పాటించడంతో స్థానిక సమాజాల ప్రయోజనాలను గౌరవించడం కూడా ముఖ్యంమని వివరిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..