Fixed Deposits: ఆ మూడు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.. ఎంత పెరిగాయో చెక్ చేసుకోండి

| Edited By: Janardhan Veluru

Mar 03, 2023 | 1:01 PM

ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.

Fixed Deposits: ఆ మూడు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.. ఎంత పెరిగాయో చెక్ చేసుకోండి
Money
Follow us on

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో సవరణలను అనుకుణంగా బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ చేట్లను క్రమంగా పెంచుకున్నాయి. దీంతో ఎఫ్‌డీలలో పొదుపు చేసుకున్న కస్టమర్లు ఎక్కువ రాబడి పొందుతున్నారు. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సాధారణ ఖాతాదారులకు ఏడు రోజుల నుండి పదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.5 శాతం నుండి 7.10 శాతం వరకు వడ్డీ రేట్లు అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ రేట్లు ఇప్పుడు ఫిబ్రవరి 24 నుండి అమలులోకి వచ్చాయి.

ఐసీఐసీఐ బ్యాంకు:

సీఐసీఐ బ్యాంకు ఏడు రోజుల నుంచి 29 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ 3.50 శాతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ICICI బ్యాంక్ వడ్డీ రేట్లు:

7-14 రోజులు 3%
15-29 రోజులు 3%
30-45 రోజులు 3.50%
46-60 రోజులు 4.25%
61-90 రోజులు 4.50%
91-120 రోజులు 4.75%

HDFC బ్యాంక్:

DFC బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏడు నుంచి 29 రోజుల మధ్య డిపాజిట్లపై బ్యాంకు మూడు శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటు 3.50 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంక్ 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమలులోకి రానున్నాయి.

HDFC బ్యాంక్ వడ్డీ రేట్లు:

7-14 రోజులు 3%
15-29 రోజులు 3%
30-45 రోజులు 3.50%
46-60 రోజులు 4.50%
61-89 రోజులు 4.50%

SBI :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏడు రోజుల నుంచి పదేళ్ల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వెబ్‌సైట్ ప్రకారం, ఏడు రోజుల నుండి పదేళ్ల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు మూడు శాతం నుంచి 7.1 శాతం మధ్య ఉంటుంది.

SBI వడ్డీ రేట్లు:

7-45 రోజులు 3%
46-179 రోజులు 4.5%
180-210 రోజులు 5.25%
211 రోజులు 1 సంవత్సరం కంటే తక్కువ 5.75%
I సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.8%

211 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై బ్యాంక్ 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..