
ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతుంది. గతేడాదితో పోలిస్తేనే వేలల్లో ధర పెరుగుదల నమోదైంది. అయితే బంగారం, వెండి ధరల్లో చారిత్రక హెచ్చుతగ్గులను పరిగణలోకి తీసుకుంటే బంగారం విలువపెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జబల్పూర్‌కు ఓ జ్యువెలర్స్ కంపెనీకు చెందిన రికార్డులు ఇటీవల బయటపడ్డాయి. 1925 నాటి రికార్డుల ప్రకారం తులం బంగారం ధర రూ. 18.75గా ఉండేది. అయితే తులం బంగారం ధర ప్రస్తుతం రూ. 84,000కు దగ్గరగా ఉంది. అలాగే 1980లో అంటే సుమారు 45 సంవత్సరాల క్రితం బంగారం ధర దాదాపు రూ.1,330 ఉండేదని వ్యాపారులు చెబుతున్నారు.
2025 నాటికి తులం బంగారం దాదాపు రూ.90,000కి చేరుకుంటుందని అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 2010 నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్ అనంతరం బంగారం ధర వేగంగా పెరుగుతూ రూ.90,000కు చేరువలో ఉంది. గత దశాబ్దంలో బంగారం ధరలను పోల్చి చూస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2015లో బంగారం ధర తులం దాదాపు రూ. 26,000 వద్ద ట్రేడ్ అయ్యింది. అంటే ప్రస్తుతం తులం దాదాపు రూ. 85,000 వద్ద ఉంది. అంటే పదేళ్లల్లో ఏకంగా రూ. 59,000 మేర ధర పెరిగింది. అయితే బంగారం ధర గత సంవత్సరాల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించినప్పటికీ ప్రస్తుత ట్రెండ్ వార్షికంగా తులానికి రూ.8,000 నుంచి రూ.10,000 వరకు పెరుగుతోంది.
బంగారం, వెండి కొనుగోలుపై ప్రజలకు ఆసక్తి లేకపోయినా బంగారం ధరల్లో ఈ పెరుగుదల సంభవిస్తోంది. ప్రస్తుత భారతదేశంలో పెట్టుబడిదారులు బంగారం కంటే ఆస్తి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలు, అమ్మకాల కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. అయితే బంగారం, వెండికి కొనుగోలును మహిళలు ఇష్టపడుతున్నా ఊహించిన స్థాయి మేరకు అమ్మకాలు సాగడం లేదని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఆభరణాల బంగారానికి డిమాండ్ తగ్గిందని వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..