Debit Cards: ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీకు రూ. 10 లక్షల బీమా ఉన్నట్లే

|

Jun 28, 2024 | 6:41 PM

ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ పథకాలు మొదలు అన్నింటికీ బ్యాంకు ఖాతా అనివార్యంగా మారింది. దీంతో సహజంగానే ఏటీఎమ్‌ల వినియోగం కూడా పెరిగింది. వీటిలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉంటాయని తెలిసిందే. అయితే మనం ఉపయోగించే ఏటీఎమ్‌ కార్డులపై బీమా ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు...

Debit Cards: ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీకు రూ. 10 లక్షల బీమా ఉన్నట్లే
ATM card
Follow us on

ప్రస్తుతం బ్యాంక్ ఖాతా లేని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ పథకాలు మొదలు అన్నింటికీ బ్యాంకు ఖాతా అనివార్యంగా మారింది. దీంతో సహజంగానే ఏటీఎమ్‌ల వినియోగం కూడా పెరిగింది. వీటిలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉంటాయని తెలిసిందే. అయితే మనం ఉపయోగించే ఏటీఎమ్‌ కార్డులపై బీమా ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు. అవును కార్డుల ఆధారంగా ఏకంగా రూ. 10 లక్షల వరకు కూడా బీమా అందిస్తారు. ఇంతకీ ఏ కార్డులపై ఎంత బీమా వర్తిస్తుంది.? వీటిని ఎలా క్లైమ్‌ చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎస్‌బీఐ గోల్డ్‌ మాస్టర్‌ కార్డ్‌ లేదా వీసా కార్డ్ కలిగి ఉన్న వారికి రూ. 4 లక్షల ఎయిర్‌ డెత్‌ (విమాన ప్రమాదాల్లో మరణిస్తే), రూ. 2 లక్షల నాన్‌ ఎయిర్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతుంది. ఇక ప్రీమియం కార్డ్‌ హోల్డర్స్‌కు రూ. 10 లక్షల ఎయిర్‌ డెత్‌, రూ. 5 లక్షల నాన్‌ ఎయిర్‌ కవర్‌ లభిస్తుంది. కాగా సాధారణ మాస్టర్‌కార్డ్‌పై రూ. 50 వేలు, ప్లాటినం మాస్టర్‌కార్డ్‌పై రూ. 5 లక్షల రూపాయలు, వీసా కార్డుపై రూ. 2 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు.

అలాగే ప్రధాన మంత్రి జనధన్ యోజన కింద ఓపెన్‌ చేసిన వారికి రూ. 1 నుంచి రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ లభిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల ముందు ఏటీఎమ్‌ కార్డుతో ఏదైనా లావాదేవీ చేస్తేనే బీమా క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు. ప్రమాదం జరిగితే, క్లెయిమ్ చేయడానికి ఆసుపత్రి బిల్లు, చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ కావాల్సి ఉంటుంది. ఏటీఎమ్‌ ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీ డెత్ సర్టిఫికేట్‌ను అందించాల్సి ఉంటుంది.

క్లెయిమ్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాల్లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకునే వారు బ్యాంకుకు వెళ్లి ఫామ్‌ను ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్‌ చేయగానే బ్యాంకు ఒక అధికారికి నియమిస్తుంది. అనంతరం అధికారులు దర్యాప్తు చేస్తారు. వెరిఫికేషన్‌ తర్వాత తుది నివేదికను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత, క్లెయిమ్ మొత్తం 10 రోజుల వ్యవధిలో అందిస్తారు. ప్రమాదం జరిగిన 60 రోజుల్లోపు క్లెయిమ్‌ చేసుకుంటే బీమా మొత్తం పొందొచ్చు లేదంటే క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..