Pan Card: మీకు పాన్‌ కార్డ్‌ ఉందా.? అయితే సులభంగా లోన్ పొందొచ్చు..

వీటితో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి కచ్చితంగా పాన్‌ కార్డ్ ఉండాల్సిందే. డీమ్యాట్‌ ఖాతా తెరవడానికి కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఇక ఐటీ రిటర్న్స్‌తో పాటు, ఐడెంటింటీ ప్రూఫ్‌గా కూడా పాన్‌ కార్డ్‌ ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఆర్థిక పరమైన విషయాలకు పాన్‌ కార్డ్ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం పాన్‌ కార్డ్...

Pan Card: మీకు పాన్‌ కార్డ్‌ ఉందా.? అయితే సులభంగా లోన్ పొందొచ్చు..
Pan Card
Follow us

|

Updated on: Nov 19, 2023 | 9:06 PM

ఒకప్పుడు పాన్‌ కార్డ్ను కేవలం కొందరు మాత్రమే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం బ్యాంక్‌ లావాదేవీలు పెరగడం, ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతాలు అనివార్యంగా మారడంతో పాన్‌ కార్డులు ఉపయోగించాల్సి వచ్చింది. పదెంకెల పర్మినెంట్‌ అకౌంట్ నెంబర్‌తో కొన్ని లావాదేవీలకు అనివార్యంగా మారింది. బ్యాంక్‌లో రూ. 50 వేలు దాటే లావాదేవీలకు పాన్‌కార్డ్‌ను తప్పనిసరి అనే విషయం తెలిసిందే.

వీటితో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి కచ్చితంగా పాన్‌ కార్డ్ ఉండాల్సిందే. డీమ్యాట్‌ ఖాతా తెరవడానికి కూడా పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఇక ఐటీ రిటర్న్స్‌తో పాటు, ఐడెంటింటీ ప్రూఫ్‌గా కూడా పాన్‌ కార్డ్‌ ఉపయోగపడుతుంది. ఇలా ఎన్నో ఆర్థిక పరమైన విషయాలకు పాన్‌ కార్డ్ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం పాన్‌ కార్డ్ దీనికే పరిమితం కాకుండా పాన్‌ కార్డ్‌తో లోన్‌ కూడా పొందొచ్చు.

మీకు పాన్‌ కార్డ్ ఉంటే రూ. 50,000 వరకు లోన్ పొందొచ్చు. ప్రస్తుతం చాలా బ్యాంకులు పాన్‌ కార్డు ఉంటే రుణాలు అందిస్తున్నాయి. ఇంతకీ పాన్‌ కార్డ్ ద్వారా ఎలా రుణం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్‌ కార్డ్‌తో లోన్‌ తీసుకోవాలంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇక లోన్ పొందడానికి కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అలాగే మీరు ఉద్యోగా అయినా, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నా.. మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. క్రెడిట్‌ స్కోర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ లన్‌ పొందొచ్చు.

పాన్‌ కార్డ్ సహాయంతో బ్యాంకులు లేదా నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ సంస్థలు మీ సిబిల్ స్కోర్‌ను చెక్‌ చేస్తాయనే విషయం తెలిసిందే. మీకు మంచి క్రెడిట్ హిస్టరీ రికార్డు ఉంటే.. మీ సిబిల్‌ స్కోర్ మెరుగుపడుతుంది. ఇక ఒకవేళ సిబిల్‌ స్కోర్‌ ఉంటే.. బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రూ. 50,000 వరకు రుణాన్ని అందిస్తున్నాయి. అత్యవసర సమయంలో ఈ పర్సనల్ లోన్‌ను చాలా సులభంగా ఉంటాయి. ఇందుకోసం కస్టమర్లు బ్యాంకులను నేరుగా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..