Post Office Saving Account: పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా… ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా.. అయితే ప్రభుత్వం మీకు ఓ శుభవార్తను అందించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ సేవింగ్స్ ఖాతాలో రూ.3,500 వరకు పొందిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్రం కల్పించింది.

Post Office Saving Account: పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా... ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!
Post Office

Updated on: Jul 07, 2021 | 10:55 PM

Post Office Saving Account: మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా.. అయితే ప్రభుత్వం మీకు ఓ శుభవార్తను అందించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ సేవింగ్స్ ఖాతాలో రూ.3,500 వరకు పొందిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్ర కల్పించింది. అలాగే ఉమ్మడిగా (జాయింట్ ఎకౌంట్) ఉన్నట్లయితే రూ.7,000 వరకు పన్ను మినహాయింపును అందించనుంది. దాంతో ఖాతాదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని కేంద్రం ప్రకటించింది. చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకుల కంటే.. అధిక వడ్డీరేటుతో పాటు పన్ను మినహాయింపు అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.7 శాతం అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ను పరిశీలిస్తే.. 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కనీసం ₹500 డిపాజిట్ తోనే పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు పొదుపు ఖాతాపై వడ్డీని ప్రతి నెలా 10వ తేదీ లేదా ఆ నెలలో చివరి రోజు ఉంచిన కనీస బ్యాలెన్స్ పై లెక్కించి వడ్డీని అందిస్తారు. అయితే, ఆర్థిక సంవత్సరం చివరల్లో రూ.500కు మించి డబ్బులు డిపాజిట్ చేయకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజుగా రూ.100 కోత పెడతారు.

పోస్టాఫీసు పొదుపు ఖాతాతోపాటు స్మాల్ సేవింగ్ పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటును మార్చలేదు. భారతీయ తపాలా శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న 1.5 మిలియన్ పోస్టాఫీసుల్లో అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా డబ్బును సురక్షితంగా.. రిస్క్ లేని వాటిలో పెట్టుబడి పెట్టాలని చూస్తుంటారు. బ్యాంకులతో పోల్చితే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో అధిక వడ్డీ వస్తుంది. ఇటీవల పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాలు భారీగానే పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకే ప్రస్తుతం పర్సనల్, జాయింట్ ఖాతాలపై పన్ను మినహాయింపును అందించింది.

Also Read:

LIC: జీవన్ ఆనంద్ పాలసీతో నెలకు రూ. 2500 రూపాయలు జమతో లక్షలు తీసుకోండి..

Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?