Property Buyers Alert: ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నిశాంత్‌కు వైజాగ్ లో ఓ ఫ్లాట్ నచ్చింది. అతడు దానిని కొనేందుకు 55 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడు. అయితే అగ్రిమెంట్(Agreement) లో ఈ డీల్ విలువను 45 లక్షల రూపాయలుగా చూపించారు. కొనుగోలులో 10 లక్షల రూపాయలను నగదు రూపంలో(In Cash) చెల్లించారు. తీరా రిజిస్ట్రేషన్ చేసేందుకు వెళ్లగా సర్కిల్ రేటు ప్రకారం ఫ్లాట్ ధర 70 లక్షలుగా గుర్తించారు. ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించిన నిబంధనల గురించి నిశాంత్‌కు పెద్దగా అవగాహన లేదు. అందుకే 70 లక్షల రూపాయలకు స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నిశాంత్ ఇంటికి వచ్చి కొన్ని నెలలు గడిచిన కొన్నాళ్ల తరువాత ఆదాయపు పన్ను శాఖ నుంచి అతనికి ఒక నోటీసు వచ్చింది. వీటన్నింటి కారణంగా కొత్త ఇల్లు కొనాలనే నిశాంత్ ఉత్సాహం, ఆనందం మెుత్తం పాడయ్యాయి. అసలు అది ఎలా జరిగిందో నిశాంత్ కు అర్థం కావటం లేదు.
చట్టం ఏమిచెబుతుందంటే..
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 50C నిబంధనల ప్రకారం.. ప్రాపర్టీ సేల్ విషయంలో ఒప్పందం విలువ సర్కిల్ రేటు కంటే తక్కువగా ఉంటే.. స్టాంప్ డ్యూటీ ఆధారంగా అమ్మిన వ్యక్తి అదే విలువను అందుకున్నట్లు పరిగణిస్తారు. ఈ ఆదాయం అమ్మిన వ్యక్తి క్యాపిటల్ ఇన్కమ్ కింద పరిగణిస్తారు. ప్రాపర్టీ హోల్డింగ్ ఆధారంగా ఈ ఆదాయం మెుత్తంపై టాక్స్ విధిస్తారు. కొనుగోలుదారు విషయంలో దీనిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పరిగణిస్తారు. ఇది అతని యాన్యువల్ ఇన్కమ్ కు యాడ్ చేస్తారు. ఈ మొత్తంపై నిశాంత్ సంబంధిత శ్లాబ్ కింద ఇన్కమ్ టాక్స్ చెల్లించాలి. సెక్షన్ 50C కింద.. అగ్రిమెంట్ ధర, సర్కిల్ రేటుకు మధ్య 10 శాతం వరకు డిఫరెన్స్ ఉండవచ్చు. భారతదేశంలో ప్రాపర్టీ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. జిల్లా యంత్రాంగం నగరాల్లో భూమి, ఇతర ఆస్తులకు స్టాండర్డ్ రేటును నిర్ణయిస్తుంది. ఈ రేటు కంటే తక్కువకు ప్రాపర్టీలను రిజిస్టర్ చేయరు. దీనినే సర్కిల్ రేటు అని అంటారు. పెద్ద నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో సర్కిల్ రేట్లు వేరువేరుగా ఉంటాయి. అగ్రిమెంట్ విలువ తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రాపర్టీని మాత్రం సర్కిల్ రేటుకే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారం నిశాంత్ 45 లక్షల రూపాయలకు ప్రాపర్టీ కొనుగోలుకు డీల్ కుదుర్చుకున్నాడు. అతను 30 శాతం పన్ను స్లాబ్ పరిధిలోకి వస్తాడు. కాబట్టి నిబంధనల ప్రకారం సర్కిల్ రేటు ధర 70 లక్షల రూపాయలు కాబట్టి.. అతను 70 లక్షల నుంచి 45 లక్షలను తీసివేశాక మిగిలిన 25 లక్షల రూపాయల వ్యత్యాసంపై టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. అతను అప్పర్ స్లాబ్ రేటు ప్రకారం 30 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. అంటే.. 25 లక్షల రూపాయలపై ఏడున్నర లక్షల రూపాయల టాక్స్ చెల్లించాలి. దీనికి అదనంగా సెస్, సర్ ఛార్జ్ విడిగా కలుపుతారు.
ఎక్కడ తప్పు జరిగిందంటే..
నిశాంత్ ఇంటి కొనుగోలుకు మొత్తం 55 లక్షల రూపాయలు ఇచ్చాడు కాబట్టి అగ్రిమెంట్ లో 45 లక్షల రూపాయల డీల్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోక తప్పలేదు. రూ.55 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని ఉంటే.. అప్పుడు అతను సర్కిల్ రేటు 70 లక్షలు, అగ్రిమెంట్ రేటు 55 లక్షలకు మధ్య వ్యత్యాసం ఉన్న 15 లక్షల రూపాయలపై మాత్రమే టాక్స్ కట్టాల్సి ఉండేది. అంటే 15 లక్షల రూపాయలపై నాలుగున్నర లక్షలు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. అగ్రిమెంట్ 55 లక్షలకు చేసుకోవటం ద్వారా ఇంతకు ముందులా ఏడున్నర లక్షల రూపాయలకు బదులు నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందనమాట. ఇలా అతనికి 3 లక్షల రూపాయలు ఆదా అవుతుంది. డీల్ గమనిస్తే 10 లక్షల రూపాయలు నగదు రూపంలో చెల్లించినట్లు ఉందని టాక్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడు బల్వంత్ జైన్ అన్నారు. నగదు రూపంలో చెల్లింపు జరిగిన ఈ మెుత్తం లెక్కల్లో చూపని నల్లధనం కిందకు వస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయం ఆదాయపన్ను శాఖకు తెలిస్తే.. ప్రాపర్టీ కొన్న నిశాంత్ ఈ మెుత్తంలో పన్ను, వడ్డీతో పాటు టాక్స్ అధికారులు విధించే ఫైన్, పనిష్మెంట్ కూడా ఉంటుందని బల్వంత్ జైన్ హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకునేందుకు ప్రాపర్టీ ఒప్పందం చేసుకునే ముందే ఆ ప్రాంతానికి సంబంధించిన సర్కిల్ రేటు గురించి తప్పక తెలుసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. అగ్రిమెంట్ సర్కిల్ రేటు కంటే తక్కువకు అస్సలు చేయకూడదని వివరించారు. ఈ రోజుల్లో ప్రాపర్టీ సెల్లర్, బయర్ ఇద్దరూ రిజిస్ట్రేషన్ సమయంలో వారి పాన్, ఆధార్ వివరాలు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల డీల్ లావాదేవీకి సంబంధించిన వివరాలు ఇన్కమ్ టాక్స్ అధికారులకు తెలుస్తాయి. వారికి ఏదైనా అనుమానం కలిగితే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు. పన్ను ఎగవేతకు సంబంధించిన విషయాల్లో చిక్కుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని బల్వంత్ జైన్ స్పష్టం చేశారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..
ప్రాపర్టీ అగ్రిమెంట్ ఫైనల్ చేసుకునే ముందు.. దాని వాస్తవ విలువ, ఆ ప్రాంతపు సర్కిల్ రేటు ప్రకారం అంచనా వేయాలి. డీల్ కి సంబంధించిన పూర్తి చెల్లింపును ఆన్‌లైన్ లేదా చెక్కు ద్వారా మాత్రమే చేయండి. ప్రాపర్టీ కొనుగోలు కోసం చెల్లించిన దాని కంటే తక్కువ విలువకు అగ్రిమెంట్లు చేసుకోకండి. ఇన్కమ్ టాక్స్ శాఖ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఇలాంటి వాటిని పర్యవేక్షిస్తుంది. ఒక వేళ మీరు పట్టుబడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఇవీ చదవండి..
Stock Market: నెలఖరులో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఫోకస్ లో ఉన్న ఆ కంపెనీల షేర్లు..
Multibagger Returns: ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించిన టాటా షేర్.. 2 ఏళ్లలో మంచి రిటర్న్స్..