DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

DMart vs Reliance Retail: ఇతర సూపర్‌ మార్కెట్లో కంటే డీమార్ట్‌లో తక్కువ ధరలకే నిత్యవసర సరుకులతో పాటు ఇతర అన్ని సరుకులు లభిస్తాయి. అలాగే ఏ వస్తువు అయినా చేతికి అందేలా సులభంగా లభిస్తాయి. మార్ట్‌లో మొత్తం తిరుగుతూ కావాల్సిన..

DMart vs Reliance Retail: డిమార్ట్ vs రిలయన్స్ రిటైల్.. చౌకైన షాపింగ్‌ కోసం ఏది బెస్ట్‌?

Updated on: Aug 27, 2025 | 6:29 PM

DMart vs Reliance Retail: డీమార్ట్ ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది తక్కువ ధరలకే లభించడం. సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు ఎంత దూరమైన వెళ్లి డీమార్ట్‌లోనే షాపింగ్‌ చేస్తుంటారు. ప్రతి రోజు అన్ని రకాల వస్తువులపై ఆఫర్లు అందిస్తుంటారు. ఇతర సూపర్‌ మార్కెట్లో కంటే డీమార్ట్‌లో తక్కువ ధరలకే నిత్యవసర సరుకులతో పాటు ఇతర అన్ని సరుకులు లభిస్తాయి. అలాగే ఏ వస్తువు అయినా చేతికి అందేలా సులభంగా లభిస్తాయి. మార్ట్‌లో మొత్తం తిరుగుతూ కావాల్సిన సరుకులన్ని తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Horoscope: ఈ రాశి వారికి సెప్టెంబర్‌లో ఎన్నో ఒడిదుడుకులు.. ఆ సమస్యలు పరిష్కారం!

భారీగా డిస్కౌంట్లు:

ఇవి కూడా చదవండి

ఇక రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులపై ఎక్కువ ఆఫర్లు అందిస్తుంటారు. అలాగే ప్యాకింగ్‌ కూడా సింపుల్‌గా ఉంటుంది. కానీ ధర వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు డీమార్ట్‌కు వెళ్తుంటారు. డీమార్ట్‌లో అన్ని వస్తువులు కూడా తక్కువ ధరల్లోనే లభిస్తాయి.

రిలయన్స్ రిటైల్:

ఇక రిలయన్స్ రిటైల్ షాపులు దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కేవలం కిరాణా సరుకులు మాత్రమే కాకుండా ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ వరకు లభిస్తాయి. ఇక్కడ ఎక్కువగా బై వన్ గెట్ వన్ 1 ఫ్రీ లేదా భారీ ఫెస్టివల్ ఆఫర్లు ఉంటాయి. ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. పెద్ద షాపింగ్ మాల్స్‌లో లగ్జరీ షాపింగ్ అనుభవం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Schools Holiday: విద్యార్థులకు మళ్లీ పండగ లాంటి వార్త.. గురువారం విద్యాసంస్థకు సెలవు.. ఎందుకంటే

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్‌లో వస్తువుల ధరలు కొన్నిసార్లు మార్కెట్ ధరలతో సమానంగా లేదా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ కానీ బల్క్ ఆఫర్లు లేదా ఫెస్టివల్ సేల్ సమయంలో మాత్రం కాస్త ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది.

ఇక్కడ రోజు వారీ అవసరాలకు ఉపయోగించే బియ్యం, ఆయిల్‌, పప్పులు వంటివి డీమార్ట్‌ కంటే కొంత తక్కువ ధరల్లోనే లభిస్తుంటాయి. ఇక రోజువారీ షాపింగ్ చేయాలనుకునే వారికి డీమార్ట్ బెస్ట్ అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Passport Colours: భారతదేశంలో ఈ 4 రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల అర్థం ఏమిటి?

ఇక ఫ్యాషన్ అండ్‌ లైఫ్‌స్టైల్‌ సంబంధించిన వస్తువులు కావాలంటే రిలయన్స్ రిటైల్‌లో ఎక్కువ ఆఫర్లు ఉంటాయి. ఫెస్టివల్ సీజన్ ఆఫర్ల విషయానికి వస్తే రిలయన్స్ రిటైల్‌లో భారీ డిస్కౌంట్లు వస్తాయి.

తక్కువ ధరలో రోజువారీ అవసరాల కోసం వస్తువులను కొనుగోలు చేయాలంటే డీమార్ట్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ లేదా పెద్ద ఆఫర్లు కావాలనుకునే వారికి రిలయన్స్ రిటైల్ సరైన ఎంపిక చెప్పుకోవచ్చు..

అందుకే ఈ రెండింటిలోను ఆఫర్లు ఉంటాయి. కానీ మీ అవసరాలను బట్టి స్టోర్‌ను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీకు రోజు వారీగా అవసరం అయ్యే వస్తువుల కోసం రెగ్యులర్ షాపింగ్ చేస్తుంటే డీమార్ట్ మొదటి ఆప్షన్‌. కానీ పండుగ సీజన్‌లో ఫ్యామిలీ షాపింగ్ చేయాలనుకుంటే రిలయన్స్ రిటైల్‌లో ఆఫర్లు ఎక్కువగా లభిస్తాయని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: Hyderabad Richest People: హైదరాబాద్‌లో టాప్‌ ధనవంతులు వీరే.. ఏయే రంగాల్లో..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి