
DMart Discounts Offers: సామాన్య ప్రజలు ఇతర సూపర్ మార్కెట్ల కంటే డిమార్ట్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ధరల్లో లభిస్తాయి. జనవరి 2026 ఆఫర్లలో భాగంగా పలు వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తుంది డిమార్ట్. కిచెన్ వేర్, కిరాణా సామాన్లు, దుస్తులతో సహా ఇతర వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తుంది. ఎప్పుడు కూడా ఆఫర్లు ఉన్నప్పటికీ ఈ జనవరిలో కొంత ఎక్కువగా అందిస్తోంది.
కిరాణా సరుకులపై ఆఫర్లు:
జనవరి 2026 ఆఫర్లలో భాగంగా నిత్యవసర సరుకులు, హౌస్‌హోల్డ్ స్టేపుల్స్, డైలీ ఎసెన్షియల్స్ కు సంబంధించి బల్క్ ప్యాక్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, బెవరేజెస్, డ్రై ఫ్రూట్స్, కుకింగ్ ఆయిల్స్, రైస్, దాల్స్, స్పైసెస్, మసాలాలపై 30 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. నెలవారి సరుకులలో కొన్నింటిపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
కుక్‌వేర్ సెట్స్‌పై..
కుక్ వేర్ సెట్స్ పై భారీగా తగ్గింపు ఇస్తుంది. ప్రెషర్ కుక్కర్స్, కడాయిలు సహా పలు వస్తువులపై రూ.499 నుంచి డిస్కౌంట్ ఇస్తుంది. ‘ది గ్రేట్ కిచెన్ ఫెస్ట్’ లో భాగంగా బెస్ట్ డీల్స్ అందిస్తుంది. హోమ్ అప్లయన్సెస్.. మిక్సర్స్, జ్యూసర్స్, టోస్టర్స్, ఇండక్షన్ కుక్ టాప్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. స్టీల్ ప్రొడక్ట్స్, క్రాకరీ, ప్లాస్టిక్ గూడ్స్, ఇతర కిచెన్ ఎసెన్షియల్స్ మీద భారీగా తగ్గింపు ఇస్తుంది.
దుస్తులపై ఆఫర్లు:
అలాగే దుస్తుల మీద ఆఫర్లు అందిస్తోంది. మెన్, విమెన్, కిడ్స్ అపారెల్స్ క్యాజువల్, ట్రెడిషనల్, ఫార్మల్స్ దుస్తులపై భారీగా డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే ఇతర వస్తువులపై కూడా ఆఫర్లు అందిస్తోంది.
ఇది కూడా చదవండి: RBI Penalty: ఈ బ్యాంకుపై కేవలం నాలుగు రోజుల్లోనే రెండు సార్లు భారీ జరిమానా.. కారణం ఏంటంటే..!
ఇది కూడా చదవండి: Indian Railways: తత్కాల్ టికెట్‌ను రద్దు చేసుకుంటే రీఫండ్ ఎందుకు రాదు? ఈ పాలసీ వెనుక కారణం ఏమిటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి