AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement plans: వీటిలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పక్కా..ఐదేళ్లలో అదిరే రాబడి

రిటైర్మెంట్‌ తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రణాళిక వేసుకుంటారు. మంచి రిటైర్మెంట్‌ పథకాల్లో డబ్బులను దాచుకుంటారు. అలాంటి వాటిలో నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) ఒకటి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు రంగ కార్మికులందరూ దీనిలో చేరడానికి అర్హులే. ఈ పథకంలో ప్రతి నెలా లేదా ఏడాదికోసారి కొంత మొత్తాన్ని జమ చేస్తారు. వీటిని వివిధ ఫండ్స్‌ మేనేజర్లు పెట్టుబడులు పెడతారు. ఆ ఉద్యోగి రిటైర్మెం​ట్‌ నాటికి పెద్ద మొత్తంలో సొమ్మును అందుకుంటాడు. అలాగే లార్జ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉంటాయి. వీటిని మార్కెట్‌ పెట్టుబడి సాధనాలు అంటారు. అధిక రాబడి కోరుకునే వారందరూ వీటిలో డబ్బులను ఇన్వెస్ట్‌ చేయవచ్చు. కానీ ఇది రిటైర్మెంట్‌ పథకాలు కావు. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో పెట్టుబడి పెడితే ఐదేళ్లలో దేని నుంచి ఎక్కువ రాబడి వస్తుందో తెలుసుకుందాం.

Retirement plans: వీటిలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పక్కా..ఐదేళ్లలో అదిరే రాబడి
senior citizens
Nikhil
|

Updated on: Jun 01, 2025 | 4:45 PM

Share

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ప్రస్తుతం 11 మంది ఎన్ పీఎస్ ఫండ్ మేనేజర్లు ఉన్నారు. వీరు ఈక్విటీ (ఈ), కార్పొరేట్ డెట్ (సీ), ప్రభుత్వ బాండ్‌లు (జీ), ఆల్టర్నేట్ ఫండ్‌లు (ఏ)తదితర వాటిలో పెట్టుబడులు పెడతారు. ఎన్ఫీఎస్ పథకంలో టైర్ – 1, టైర్ – 2 అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి. టైర్ -1 అనేది తప్పనిసరి ఖాతా. పదవీ విరమణ కోసం రూపొందించిన దీర్థకాలిక పొదుపు పథకం. దీనిలో డబ్బులను ఉపసంహరించుకునేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక టైర్ -2 అనేది ఐచ్చిక ఖాతా. దీనిలో డబ్బులను ఎప్పుడైనా డ్రా చేసుకునే వీలుంటుంది. ఎన్పీఎస్ చందాదారులు దాని పరిధిలోని ఫండ్ మేనేజర్లలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. వారి ద్వారా మీ డబ్బులను వివిధ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. అధిక రాబడి సంపాదించాలనుకునేవారు మంచి ఫండ్ మేనేజర్ ను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వివిధ ఫండ్స్ మేనేజర్ల ఇన్వెస్టుమెంట్లు వేర్వేరు రకాలుగా ఉంటాయి. కాగా..ఐదేళ్లలో ఎన్పీఎస్ ఈక్విటీ ఫండ్స్, టాప్ 5 లార్జ్ మ్యూచువల్ ఫండ్స్ అందించిన రాబడి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్

గత ఐదేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్ ఇది. ఈక్విటీ విభాగంలో 25.25 శాతం రాబడిని అందించింది. ఎన్ పీఎస్ చందాదారుల కోసం స్కీమ్- ఈని అమలు చేసింది. ఇక లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు వార్షిక రాబడి 23.36 శాతంగా ఉంది.

యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్

ఈ ఫండ్ కూడా తన వాటాదారులకు మంచి లాభాలను అందజేసింది. ఐదేళ్లలో 25.12 శాతం సీఏజీఆర్ నమోదైంది. ఇక లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో 23.36 శాతం సగటు వార్షిక రాబడినిచ్చింది.

ఇవి కూడా చదవండి

కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్

కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్ కు సంబంధించి ఐదేళ్ల సీఏజీఆర్ 24.85 శాతంగా నమోదైంది. ఇది లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో సగటు రాబడి 23.36 శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఎల్ఐసీ పెన్షన్ ఫండ్

ఎల్ఐసీ పెన్షన్ ఫండ్ కూడా ఐదేళ్లలో 24.80 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా నమోదైంది.

హెచ్ డీఎఫ్ సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ

ఈ కంపెనీ సీఏజీఆర్ గత ఐదేళ్లలో 24.08 శాతం నమోదైంది. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు రాబడి కంటే ఎక్కువే.

టాప్ 5 పెన్షన్ ఫండ్స్ ద్వారా వచ్చే ఐదేళ్ల రాబడితో పోలిస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ కేటగిరీ పనితీరు తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో టాప్ 5 లార్జ్ క్యాప్ ఫండ్‌లు వ్యక్తిగతంగా గణనీయమైన మార్జిన్‌తో పనిచేశాయి. దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళిక కోసం ఎన్ పీఎస్ ఒక శక్తివంతమైన సాధనం. స్థిరమైన రాబడి, ప్రభుత్వ పర్యవేక్షణ, పన్ను ప్రయోజనాలను (పాత విధానం) కోరుకునే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..