Uber CEO : డెలివరీ బాయ్‌గా పనిచేసిన ఊబర్ సీఈవో..! ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

|

Jun 29, 2021 | 6:49 PM

Uber CEO : కొంతమంది ఉన్నతవంతులు ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి గర్వం అంటూ ఏది ఉండదు. చాలా ఒద్దికగా

Uber CEO : డెలివరీ బాయ్‌గా పనిచేసిన ఊబర్ సీఈవో..! ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?
Uber Ceo
Follow us on

Uber CEO : కొంతమంది ఉన్నతవంతులు ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి గర్వం అంటూ ఏది ఉండదు. చాలా ఒద్దికగా పనిచేసుకుంటూ ఉంటారు. అలాంటి కోవకే చెందుతాడు ఊబర్ ఈట్ సీఈవో దారా ఖోస్రోషాహి. తన సంస్థలో రెండు రోజులు సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు. ఉద్యోగులందరికి ఆదర్శంగా నిలిచాడు. కష్టపడి పనిచేస్తే ఎవ్వరైనా విజేతలవుతారని చెప్పకనే చెప్పారు. రెండు రోజుల వేతనాన్ని చూసుకొని మురిసిపోయారు. అయితే ఇది కొంతమందికి మాత్రం నచ్చడంలేదు.

అయితే దారా ఖోస్రోషాహి ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం తెలియజేశారు. తన ఫుడ్ డెలివేరి అనుభవాన్ని పంచుకుంటూ “ఉబెర్ ఈట్స్ కోసం కొన్ని గంటలు ఫుడ్ డెలివేరి చేశాను. 1.శాన్ ఫ్రాన్సిస్కో నిజానికి ఒక అందమైన పట్టణం. 2. రెస్టారెంట్ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. 3. ఇప్పుడు బిజీ ! ఆన్‌లైన్‌లో 3:30 నాటికి డెలివేరి చేయాలి. 4. నేను ఆకలితో ఉన్నాను – ఏదైనా ఆర్డర్ చేసే సమయం వచ్చింది. ” అంటూ పోస్ట్ చేశారు. ట్విట్టర్ హ్యాండిల్‌లో దారా ఖోస్రోషాహి రెండవ రోజు డెలివరీ గురించి కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు.

“డే 2- మొదటి రోజులాగా లేదు. ఎక్కువ ట్రాఫిక్, తక్కువ టిప్స్, ఫాస్ట్ డెలివేరి అంటూ పోస్ట్ చేశారు. ఇందులో దారా ఖోస్రోషాహి మొత్తం. 50.63 (సుమారు రూ. 3756) సంపాదించారు అలాగే మొత్తం 6 ట్రిప్పులను పూర్తి చేశారు. దీంతో ఆయనకు మొత్తం 18 పాయింట్లు వచ్చాయి. అలాగే అతను చేసిన పనికి కాస్త నెగెటివిటీ కామెంట్స్ కూడా వచ్చాయి. కొందరు పబ్లిసిటీ స్టంట్‌ అదిరిందంటూ ఖోస్రోషాహిని హేళన చేశారు. ఇంకొందరు ఉబెర్‌ ఈట్స్‌ సర్వీసును పొగుడుతూనే డెలివేరి వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్పండంటూ చురకలంటించారు.

Hyderabad Skin Bank: తెలుగు రాష్ట్రాల్లో తొలి చర్మ బ్యాంకుకు శ్రీకారం.. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స

Bells Palsy: కరోనాతో మరో ముప్పు.. వైరస్ బారిన పడిన వారికి ముఖపక్షవాతం ‘బెల్స్ పాల్సీ’ వచ్చే అవకాశం

Kim Jong-un: స్లిమ్ అయిన కిమ్… షాక్ అవుతున్న నెటిజన్లు…!! వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో