విదేశాల నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకురావడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు కోరుకున్నంత బంగారం తీసుకురాలేరు. మీరు విదేశాలకు బంగారాన్ని తీసుకెళ్లినప్పుడు లేదా అక్కడి నుండి బంగారాన్ని తిరిగి తీసుకురావడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక కిలో కంటే ఎక్కువ బంగారాన్ని భారతదేశంలోకి తీసుకెళ్లకూడదు. నిర్దిష్ట మొత్తంలో బంగారంపై దిగుమతి సుంకం లేదు. ఎక్కువ బంగారంపై పన్ను కట్టాల్సి ఉంటుంది. బంగారం రవాణా చేయడానికి ఎంత కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలనే దాని గురించి తెలుసుకుందాం.
విదేశాల నుంచి భారత్‌కు సుంకం లేకుండా ఎంత బంగారాన్ని తీసుకురావచ్చు?
ఒక వ్యక్తి 18 ఏళ్లు పైబడిన పురుషుడు అయితే 20 గ్రాముల బంగారం లేదా రూ. 50,000 విలువైన బంగారాన్ని తీసుకువస్తే దానిపై దిగుమతి (కస్టమ్స్ సుంకం) లేదు. మహిళలు లేదా పిల్లలు 40 గ్రాముల బంగారం లేదా రూ.1,00,000 విలువైన బంగారాన్ని పన్ను లేకుండా తీసుకురావచ్చు.
బంగారం కొనుగోలుకు రశీదు తదితరాలు ఉండాలి:
మీరు బంగారం లేదా వెండితో చేసిన ఆభరణాలను కలిగి ఉంటే, మీరు కొనుగోలు చేసిన రసీదు మొదలైన పత్రాలను కలిగి ఉండాలి. అధికారులు అడిగితే చూపించాలి. డ్యూటీ ఫ్రీ లిమిట్ కంటే ఎక్కువ బంగారం ఉంటే ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ విభాగంలో ప్రకటించాలి. లేదంటే అధికారులు బంగారాన్ని జప్తు చేయవచ్చు.
కనీసం ఆరు నెలల పాటు విదేశాల్లో నివసించి ఉండాలి:
విదేశీ పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి బంగారం కొనుగోలు చేస్తే కస్టమ్స్ సుంకం చెల్లించాలి. విదేశాలకు వెళ్లి ఆరు నెలల్లోపు తిరిగితే 10 గ్రాముల బంగారంపై కూడా పన్ను చెల్లించాలి. కనీసం ఆరు నెలల పాటు విదేశాల్లో ఉండి బంగారం భారత్‌కు వస్తే డ్యూటీ ఫ్రీ. ఇక్కడ పరిమితికి మించి బంగారం ఉంటే డ్యూటీ ఫ్రీ లేదు. పన్ను చెల్లించాలి.
ఈ పరిమితికి మించి బంగారాన్ని తీసుకువస్తే, దానికి 3 నుండి 10 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. డ్యూటీ ఫ్రీ బంగారం అంటే ఇక్కడ ఆభరణాల బంగారం. మీరు బంగారు నాణెం, బంగారు కడ్డీ మొదలైన వాటిని రవాణా చేస్తుంటే కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: పండగకు ముందు షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి