దేశంలో ఎంత మంది యాక్టివ్ క్రెడిట్ కార్డుదారులున్నారు. ఇప్పటికే భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య 7 కోట్ల 93 లక్షలకుపైగా చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన రిపోర్ట్ లో తెలిపింది. ప్రతి నెలా దాదాపు 2 శాతం కొత్త క్రెడిట్ కార్డులు ఇష్యూ అవుతున్నాయి. ప్రతినెల బ్యాంకులు వేలల్లో క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ లోన్ పై మంచి వడ్డీ లభిస్తున్నందున బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెడతాయి. బ్యాంకులు క్రెడిట్ కార్డ్ లపై భారీ వడ్డీ సైతం వసూలు చేస్తున్నాయి.
క్రెడిట్ కార్డ్‌లతో చేసే చిన్న చిన్న తప్పులతో ఇబ్బందుల్లో పడతారు. అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏర్పడితే, మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు. మీరు గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేలోపు డబ్బును తిరిగి ఇస్తే, మీరు రూ.1 వడ్డీని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే క్రెడిట్ కార్డు నిబంధనలను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం వల్లే అసలు సమస్య తలెత్తుతోంది. ఉదాహరణకు, మీరు పూర్తిగా ఉపయోగించిన కార్డ్ పరిమితి 1 లక్ష అయితే దానిని తిరిగి చెల్లించే సమయం వచ్చినప్పుడు కనిష్ట మొత్తం అంటే కనీస బకాయి చెల్లించిన తర్వాత మీరు కొత్త క్రెడిట్‌ని తీసుకుంటారు.
మీరు క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు అందుకు సంబంధించిన డబ్బు కార్డు నుంచి కట్ అవుతుంటాయి. ఈ డబ్బు మీ సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌లో భాగం కాదని గుర్తించుకోండి. ఇది మీకు కేవలం అప్పుగానే ఇస్తారు. బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ అప్పుగా ఇచ్చిన డబ్బును వెంటనే వెనక్కి తీసుకోదు. కొనుగోలుదారు కొనుగోలు తేదీ నుంచి చెల్లింపు తేదీ మధ్య 40 నుంచి 50 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఇస్తారు. ఈ కాలంలో బ్యాంకు మీ నుంచి ఎటువంటి వడ్డీని వసూలు చేయదు. దీన్ని స్వల్పకాలిక వడ్డీ రహిత రుణం అని చెప్పవచ్చు. కానీ ఈ వడ్డీ రహిత కాలం ప్రారంభంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. గడువులోగా వాడుకున్న మొత్తానికి చెల్లింపులు చేయకపోతే ఆ బకాయి నెలకు 2.5 నుంచి 3.5 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. వార్షిక ప్రాదిపదికన వడ్డీ 48 శాతం వరకు పెరుగుతుంది. ఇక ఈ వడ్డీలో ప్రతియేటా మార్పులు జరుగుతుంటాయి.
అకస్మాత్తుగా డబ్బు అవసరం ఏర్పడితే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు. అయితే ముందే చెప్పినట్టు మీరు గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేలోపు డబ్బును తిరిగి ఇస్తే మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలా చేయకపోతే మీరు అప్పుల ఊబిలో కూరుపోతారు. ఉదాహరణకు మీరు పూర్తిగా ఉపయోగించిన కార్డ్ పరిమితి 1 లక్ష అయితే దానిని తిరిగి చెల్లించే సమయం వచ్చినప్పుడు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు మినిమమ్ బిల్లులు చెల్లిస్తే ఇబ్బందుల్లో పడతారు. మినిమమ్ బిల్లు చెల్లించకుండా పూర్తి బకాయి చెల్లించడమే ఉత్తమం. ఒక వేళ పూర్తి బిల్లు చెల్లించని పక్షంలో భారీగా వడ్డీ పడుతుంది. దీని వల్ల మీరు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
క్రెడిట్ కార్డులు వినియోగదారుల లోన్ పేమెంట్స్ తీరును ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తాయి. మీ సిబిల్ స్కోర్‌ని తగ్గించడానికి లేదా బ్రేక్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు వినియోగదారుకు సంబంధించిన క్రెడిట్ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపుతాయి. మీ క్రెడిట్ స్కోర్ మీకు భవిష్యత్తులో లోన్ వస్తుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఈ 3 విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మీరు మీ క్రెడిట్ స్కోర్‌ని మెరుగుపరచుకోవచ్చు. ముందుగా బిల్లును సకాలంలో చెల్లించండి. తరచుగా కనీస బకాయి చెల్లింపు చేసే అలవాటు నుంచి దూరంగా ఉండండి. ఇది మీ పేమెంట్ హిస్టరీలో చేరుస్తారు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ పై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు.. క్రెడిట్ కార్డ్ పరిమితిని పూర్తిగా ఉపయోగించవద్దు. ఇందులో కొంత మొత్తాన్ని ఎప్పటికి ఉంచుతూ ఉండాలి. దీనిని క్రెడిట్ వినియోగం అంటారు. ఇది క్రెడిట్ పరిమితి నుంచి ఉపయోగించిన క్రెడిట్ మొత్తాన్ని సూచిస్తుంది. ఈ పరిమితిని తెలివిగా ఉపయోగించడం ఎంతో ముఖ్యం.
చాలా మంది క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తుంటారు. మీరు ఎక్కడైనా షాపింగ్ చేసి క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసే ముందు కొన్ని ప్రశ్నలు మీకు మీరే వేసుకోవాలి. మీరు కొనుగోలు చేస్తున్న వస్తువులు మీకు నిజంగా అవసరమా..? లేదా అనేది గుర్తించుకుని షాపింగ్ చేయాలి. డబ్బులున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులు పడేది మీరే. సో.. క్రెడిట్ కార్డు వాడకంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి