Credit Card: ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఇక నుంచి ఈ సదుపాయాలు ఉండవు

|

Sep 03, 2024 | 7:56 AM

కొత్త నెల ప్రారంభం కావడంతో పలు నిబంధనలు మారాయి. సెప్టెంబర్ 1 నుండి, వివిధ నియమాలు మారిన విషయం తెలిసిందే. వీటిలో క్రెడిట్ కార్డ్ ఒకటి. నేడు దాదాపు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. దసరాకు ముందు చాలా మంది క్రెడిట్ కార్డులపైనే అన్ని షాపింగ్‌లు చేస్తారు. క్రెడిట్‌ కార్డు రకరకాల సదుపాయాలు పొందవచ్చు. కానీ కొన్ని బ్యాంకులు రానురాను ఆ సదుపాయాలన్ని..

Credit Card: ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? ఇక నుంచి ఈ సదుపాయాలు ఉండవు
Credit Card
Follow us on

కొత్త నెల ప్రారంభం కావడంతో పలు నిబంధనలు మారాయి. సెప్టెంబర్ 1 నుండి, వివిధ నియమాలు మారిన విషయం తెలిసిందే. వీటిలో క్రెడిట్ కార్డ్ ఒకటి. నేడు దాదాపు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. దసరాకు ముందు చాలా మంది క్రెడిట్ కార్డులపైనే అన్ని షాపింగ్‌లు చేస్తారు. క్రెడిట్‌ కార్డు రకరకాల సదుపాయాలు పొందవచ్చు. కానీ కొన్ని బ్యాంకులు రానురాను ఆ సదుపాయాలన్ని కట్‌ చేసేస్తున్నాయి.

రివార్డ్ పాయింట్లు:

క్రెడిట్ కార్డు నియమాలు సెప్టెంబర్ 1 నుంచి మారిపోయాయి. ప్రత్యేకించి రివార్డ్ పాయింట్లు, చెల్లింపు సమయంపై ప్రభావం పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకారం, లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పరిమితం చేసింది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ప్రతి నెలా విద్యుత్ లేదా నీటి బిల్లులు లేదా ఇతర యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 2000 వరకు రివార్డ్ పాయింట్లు అందేవి. అలాగే Cred, Mobiquik లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పేమెంట్ చేస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎలాంటి రివార్డ్ ఇవ్వదు. బదులుగా 1 శాతం రుసుము వసూలు చేస్తుంది. దీంతో వినియోగదారుల జేబుకుపై ప్రభావం పడనుంది.

ఇది కూడా చదవండి: iPhone 16: ఐఫోన్‌ 16లో అదిరిపోయే ఫీచర్స్‌.. మొబైల్‌ విడుదలకు ముందు వివరాలు లీక్‌!

అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా తమ క్రెడిట్ కార్డ్‌లలో చెల్లింపు సమయాలను అప్‌డేట్ చేస్తోంది. సెప్టెంబర్ నుంచి క్రెడిట్ కార్డులపై కనీస బిల్లు చెల్లింపు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. చెల్లింపు తేదీని కూడా 18 రోజులకు బదులుగా 15 రోజులకు తగ్గించారు. మరోవైపు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డులతో కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి