Maruti Suzuki: కరోనా ఎఫెక్ట్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం.. 16 వరకు షట్‌డౌన్ పొడిగింపు

|

May 09, 2021 | 8:50 PM

Maruti Suzuki extends shutdown: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కారణంగా గతేడాది నుంచి అన్ని రంగాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం

Maruti Suzuki: కరోనా ఎఫెక్ట్.. మారుతి సుజుకి కీలక నిర్ణయం.. 16 వరకు షట్‌డౌన్ పొడిగింపు
Maruti Suzuki Extends Shutdown
Follow us on

Maruti Suzuki extends shutdown: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా కారణంగా గతేడాది నుంచి అన్ని రంగాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మెయింటెన్స్‌ షట్‌డౌన్‌ను తాజాగా పొడిగించింది. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత నెలలో మే1 నుంచి 9వ తేదీ వరకు షట్‌డౌన్‌ ఉంటుందని మారుతి సుజుకి సంస్థ వెల్లడించింది. అయితే షట్‌డౌన్‌ను ఇప్పుడు మే 16వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీకి దాఖలు చేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి తెలిపింది. అయితే హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ వద్ద ఉన్న ప్లాంట్లలో కొన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. ఇదిలాఉంటే.. సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ గుజరాత్‌ ప్లాంట్‌ కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

భారత్‌లో వ్యాప్తి తీవ్రమైంది. దీంతో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించడంతోపాటు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. దీంతో వాహనాల డిమాండ్‌ తగ్గింది. అంతేకాకుండా మారుతీ సుజుకీ ఆక్సిజన్‌ ఉత్పత్తిపై కూడా దృష్టిపెట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలల్లో ఆక్సిజన్‌ వినియోగం తగ్గించాలని కోరడంతో మారుతీ ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం పలు సంస్థల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కాగా.. మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో మొత్తం 1,59,955 వాహనాలను ఉత్పత్తి చేసింది. మార్చి నెలతో పోలిస్తే ఇది 7శాతం తక్కువని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కొవిడ్‌ లాక్‌డౌన్లతో ఉత్పత్తి తగ్గినట్లు మారుతీ తన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

Also Read:

మహిళలకు గుడ్‏న్యూస్… కేంద్రం కీలక నిర్ణయం.. వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే…

Silver Price Today: స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..! ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..