Mahindra BE 6: ఒక్క అక్షరంతో రెండు కంపెనీల మధ్య వివాదం.. తన కారు పేరు మార్చిన మహీంద్రా

|

Dec 10, 2024 | 5:30 PM

మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ నుంచి విడుదల కానున్న ఎలక్ట్రిక్ కారు పేరు మారింది. మహీంద్రా బీఈ 6ఈ పేరుతో లాంచింగ్ సమయంలో ఈ కారును విడుదల చేశారు. ఈ పేరుపై ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో పేరులో స్పల్పంగా మార్పు చేయాలని మహీంద్రా నిర్ణయించింది. ఇక నుంచి బీఈ 6గా పిలవనుంది. ఇండిగా అభ్యంతరాల నేపథ్యంలో ఈ అనే అక్షరాన్ని తొలగించింది. ఒక్క చిన్న అక్షరంతో రెండు దిగ్గజ కంపెనీల మధ్య వివాదం రేగింది.

Mahindra BE 6: ఒక్క అక్షరంతో రెండు కంపెనీల మధ్య వివాదం.. తన కారు పేరు మార్చిన మహీంద్రా
Mahindra Be 6
Follow us on

మహీంద్రా కంపెనీ ఇటీవల ఈవీ విభాగంలో బీఈ 6ఈ అనే మోడల్ కారును ఆవిష్కరించింది. 2025 ఫిబ్రవరిలో మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే 6ఈ అనే పేరుపై ఇండిగో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము 6ఈ బ్రాండింగ్ ను ఇప్పటికే వివిధ సేవల్లో వినియోగిస్తున్నామని తెలిపింది. విమాన సర్వీసులతో పాటు 6ఈ ఫ్లెక్స్, 6ఈ లింక్, 6ఈ ప్రైమ్ తదితర వాటిని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో మహీంద్రా కంపెన తన కారు 6ఈ పేరు పెట్టడాన్ని ఖండించింది. వివాదం కోర్టు వరకూ వెళ్లడంతో మహీంద్రా కంపెనీ తన కారు పేరు మార్చడానికి నిర్ణయం తీసుకుంది. తన కారులోని ఈ అనే పేరును తొలగించింది. ఇండిగో నిరాధర ఆరోపణలు చేస్తోందని, దీనిపై కోర్టులో తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించింది. తమ ఖాతాదారులకు మెరుగైన ఉత్పత్తులను పరిచయం చేయడం, మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపింది.

మహీంద్రా కంపెనీ ప్రతినిధులు ఈ విషయంపై స్ఫష్టమైన వివరణ ఇచ్చారు. ఇండిగో సంస్థ వాడుతున్నబ్రాండింగ్ 6ఈ అని, తమ కొత్త కారు పేరు బీఈ 6ఈ అని వివరణ ఇచ్చారు. తాము కేవలం 6ఈ అనే పేరును మాత్రమే వాడడం లేదని, దానికి ముందు బీఈ కూడా ఉందని తెలిపారు. కాబట్టి ఈ పేర్ల మధ్య తేడాలు ఉన్నాయన్నారు. ఏది ఏమైనా ఇండిగో విమానయాన సంస్థ అభ్యంతర నడుమ తన కారు పేరును స్పల్పంగా మార్పు చేయాలని మహీంద్రా కంపెనీ నిర్ణయించుకుంది. ఈ కారు విడుదల ముందే వివాదంలో చిక్కుకోవడంతో ఈ చర్యలు తీసుకుంది. కేవలం ఒక్క ఈ అనే చిన్న అక్షరం రెండు పెద్ద కంపెనీల మధ్య వివాదానికి కారణమైంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో దావా నడుస్తోంది. ఈ నేపథ్యలో తమ కారు పేరును మార్చుతున్నట్టు మహీంద్రా కంపెనీ ప్రకటన విడుదల చేసింది.

మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు 59, 79 కిలోవాట్స్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో వస్తుంది. వీటిని మహీంద్రా 175 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జర్ ను ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం చార్జింగ్ చేయవచ్చు. 79 కిలోవాట్ బ్యాటరీతో 682 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అలాగే 278 బీహెచ్ పీని విడుదల చేస్తుంది. 59 కిలో వాట్ బ్యాటరీ నుంచి 228 బీహెచ్పీ విడుదల అవుతుంది. ఈ రెండు వెర్షన్లు 380 టార్క్ ను అందిస్తాయి. 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షనాలిటీ, ఏడీఏఎస్ సూట్, 360 డిగ్రీ కెమెరా, డ్రైవర్ డిస్ ప్లే తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి