Credit Card Mistakes: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

| Edited By: Ravi Kiran

Nov 07, 2021 | 7:37 AM

Credit Card Mistakes: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ప్రాసెస్‌ చాలా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి..

Credit Card Mistakes: మీరు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!
Follow us on

Credit Card Mistakes: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డులు వాడే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు క్రెడిట్‌ కార్డు కావాలంటే ప్రాసెస్‌ చాలా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం ఫోన్‌ల ద్వారానే ప్రాసెస్‌ చేసుకుని తక్కువ సమయంలోనే క్రెడిట్‌ కార్డులు అందిస్తున్నాయి బ్యాంకులు. ఇక క్రెడిట్ కార్డు వాడకంలోకూడా అవగాహన కలిగి ఉండటం మంచిది. లేకపోతే అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది. క్రెడిట్‌ కార్డు తీసుకుని సమయానికి బిల్లులు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడే వారు చాలా మంది ఉన్నారు. కొన్ని తప్పులు చేయడం వల్ల ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయి.

ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా..

క్రెడిట్‌కార్డు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు. ఎందుకంటే క్రెడిట్‌ కార్డులో కొంత అమోంట్‌ ఏటీఎం నుంచి డ్రా చేసుకునేందుకు వెలుసుబాటు ఉంటుంది. అలా అని ఎప్పుడు కూడా ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవద్దు. ఇలా చేసినట్లయితే భారీగా ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు డబ్బులు తీసిన దగ్గరి నుంచి వాటిని చెల్లించే వరకు వడ్డీ పడుతూనే వస్తుంది. అందుకే క్రెడిట్‌కార్డు ద్వారా ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. క్రెడిట్‌ కార్డులపై కూడా డిస్కౌంట్‌ ఆఫర్లు ఇస్తుంటాయి వివిధ సంస్థలు. ఆఫర్లు ఉన్నాయి కదా అని షాపింగ్‌ చేసి సమయానికి బిల్లు చెల్లించని పక్షంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్‌ కార్డులు వాడేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

మినిమమ్‌ బిల్లు చెల్లిస్తే..

ఇక క్రెడిట్‌ కార్డు వాడుకున్న అమోంట్‌కు ప్రతి నెల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా వాడేసి బిల్లు చెల్లించే ముందు ఇబ్బందులు పడుతూ చివరకు మినిమమమ్‌ బ్యాలెన్స్‌ మాత్రమే చెల్లిస్తుంటారు. ఇలా చేసిన ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది. అసలుతోపాటు వడ్డీ కూడా పెరుగుతుంది. అందుకే క్రెడిట్‌ కార్డు వాడిన తర్వాత వచ్చే బిల్లు నెలనెల చెల్లించుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులపాలవుతుంటారు. అలాగే బిల్లులు సమయానికి చెల్లించకుంటే మీరు వాడే క్రెడిట్‌ కార్డు బ్యాంకు నుంచి ఫోన్‌ల మోత మోగుతుంటుంది. మీరు బిల్లు చెల్లించే వరకు ఫోన్‌లు చేస్తూనే ఉంటారు. దీని వల్ల కూడా మీరు టెన్షన్కు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు మీరు పూర్తి స్థాయిలో బిల్లు కట్టకుండా కేవలం మినిమమ్‌ అమోంట్‌ పే చేస్తే మరింత వడ్డీ పెరిగి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Bank Loan: బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు అందించే బ్యాంకులు ఇవే..!

Ola Grocery Delivery: వినియోగదారులకు ఓలా గుడ్‌న్యూస్‌.. ఆన్‌లైన్‌లో కిరాణా సరుకుల డెలివరీ..!