Business Idea: ఎందుకు పనికి రాని కొబ్బరి పెంకులతో లక్షల్లో ఆదాయం.. బెస్ట్ బిజినెస్‌ ప్లాన్

|

Sep 26, 2024 | 12:18 PM

మార్కెట్లో ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు డిమాండ్ పెరుగుతోంది. కొబ్బరి బొగ్గుతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఏంటీ కొబ్బరి బొగ్గు వ్యాపారం.? దీన్ని ఎలా ప్రారంభించవచ్చు. అసలు లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరి బొగ్గును బ్యూటీ ప్రొడక్ట్స్‌లో పయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌ ప్యాక్‌లు, కాస్మోటిక్స్‌, సబ్బు, స్పేర్‌ పార్టుల తయారీ, యుద్ధ పరికరాలు...

Business Idea: ఎందుకు పనికి రాని కొబ్బరి పెంకులతో లక్షల్లో ఆదాయం.. బెస్ట్ బిజినెస్‌ ప్లాన్
Business Idea
Follow us on

కాదేది వ్యాపారానికి అనర్హం అన్న దాంట్లో 100 శాతం నిజం ఉంది. మారుతోన్న అవసరాలకు అనుగుణంగా రకరకాల మార్గాల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు చాలా మంది. ఒకప్పటిలా మూస పద్ధతిలో కాకుండా ఇప్పుడు విభిన్నమైన మార్గాలను వెతుక్కుంటున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మార్కెట్లో ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు డిమాండ్ పెరుగుతోంది. కొబ్బరి బొగ్గుతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఏంటీ కొబ్బరి బొగ్గు వ్యాపారం.? దీన్ని ఎలా ప్రారంభించవచ్చు. అసలు లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొబ్బరి బొగ్గును బ్యూటీ ప్రొడక్ట్స్‌లో పయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌ ప్యాక్‌లు, కాస్మోటిక్స్‌, సబ్బు, స్పేర్‌ పార్టుల తయారీ, యుద్ధ పరికరాలు, గ్యాస్‌ మాస్కుల వంటి తయారీలో ఈ బొగ్గును ఉపయోగిస్తుంటారు. అంతేనా.. నీటిలోని క్లోరిన్, వైరస్‌, బ్యాక్టీరియాలను తరిమికొట్టడంలో కూడా కొబ్బరి బొగ్గును ఉపయోగిస్తున్నారు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే కొంత స్థలం ఉంటే చాలు. తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. బొగ్గు పెంకులను కొనుగోలు చేసి ఒక మిషిన్‌లో వాటిని కాల్చాలి. మిషన్‌ లేకుండా కూడా సాధారణ మంటపై కూడా బొగ్గు పెంకులను బాగా కల్చి వాటిని పొడిగా మార్చాలి. అనంతరం వాటిని ప్యాకింగ్‌ చేసి విక్రయించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా బొగ్గు పొడిని విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆర్డర్‌లు తీసుకొని మంచి లాభాలు ఆర్జించవచ్చు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కేజీ రూ. 50 నుంచి రూ. 70 లభిస్తోంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉండే ఈ బిజినెస్‌ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..