
నిన్న లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు(Stock Market) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 460 పాయింట్లు పడిపోయి 57,060 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 142 పాయింట్ల పడిపోయి 17,102 వద్ద ముగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరికి పతనమయ్యాయి. చివరి అరగంటలో మాత్రం అమ్మకాలు వెల్లువెత్తడంతో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, మారుతీ షేర్లు నష్టపోయాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, విప్రో, మారుతీ, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, టైటన్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. యాక్సిక్ బ్యాంక్ ఏకంగా 6 శాతానికి పైగా పతనమైంది.
నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ మీడియా 2.87 శాతం కుంగింది. తర్వాత పీఎస్‌యూ బ్యాంక్, స్థిరాస్తి, ఆటో రంగ షేర్లు కుదేలయ్యాయి. టీవీ18 షేర్లు ఏకంగా 12 శాతం మేర నష్టపోవడం గమనార్హం.గత మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను మారుతీ సుజుకీ ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర లాభం రూ.1,875 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.26,749గా, ఎబిట్‌డా రూ.2,427 కోట్లుగా నివేదించింది. నేడు త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విప్రో షేర్లు ఇంట్రాడేలో 2.5 శాతానికి పైగా నష్టపోయి 11 వారాల కనిష్ఠానికి చేరాయి.
Read Also.. E-commerce: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లకు ఎదురుదెబ్బ.. ఈ-కామర్స్ వ్యాపారంలోకి ప్రభుత్వం..!