Citroen C3 Aircross: ఈ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకూ తగ్గింపు.. ఆఫర్ మిస్ కాకండి..

సీ3, సీ3 ఎయిర్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల ధరలను కంపెనీ తగ్గించింది. సిట్రోయిన్ బ్రాండ్ మూడో యానివర్సరీ సందర్భంగా ఈ తగ్గింపును అమలు చేస్తోంది. ఈ తగ్గింపుల తర్వాత సిట్రోయి్ సీ3 కారు రూ. 5.99లక్షలు(ఎక్స్ షోరూం), సీ3 ఎయిర్ క్రాస్ రూ. 8.99లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతోంది. అంటే సీ3 పై రూ. 17,000, సీ3 ఎయిర్ క్రాస్ పై దాదాపు రూ. 1లక్ష వరకూ తగ్గింపు అందుబాటులో ఉంది.

Citroen C3 Aircross: ఈ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకూ తగ్గింపు.. ఆఫర్ మిస్ కాకండి..
Citroen C3 Aircross

Updated on: Apr 09, 2024 | 4:53 PM

ప్రముఖ ఫ్రెంచ్ కార్ మేకర్ అయిన సిట్రోయిన్ అనేక రకాల కార్లను మన దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. సిట్రోయిన్ ఇండియా బ్రాండ్ పేరుతో సీ3, ఈ-సీ3 హ్యాచ్ బ్యాక్స్ తో పాటు సీ3 ఎయిర్ క్రాస్ కాంపాక్ట్ ఎస్ యూవీ, సీ5 ఎయిర్ క్రాస్ ఎస్యూవీ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. కాగా వీటిల్లో సీ3, సీ3 ఎయిర్ క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల ధరలను కంపెనీ తగ్గించింది. సిట్రోయిన్ బ్రాండ్ మూడో యానివర్సరీ సందర్భంగా ఈ తగ్గింపును అమలు చేస్తోంది. ఈ తగ్గింపుల తర్వాత సిట్రోయి్ సీ3 కారు రూ. 5.99లక్షలు(ఎక్స్ షోరూం), సీ3 ఎయిర్ క్రాస్ రూ. 8.99లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతోంది. అంటే సీ3 పై రూ. 17,000, సీ3 ఎయిర్ క్రాస్ పై దాదాపు రూ. 1లక్ష వరకూ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు ధరలు ఏప్రిల్ 30 వరకూ అందుబాటులో ఉంటాయి.

కొత్త లిమిటెడ్ ఎడిషన్ బ్లూ..

ఈ తగ్గింపు ధరలకు అదనంగా సిట్రోయిన్ బ్రాండ్ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ‘బ్లూ’ని లాంచ్ చేసింది. సీ3, సీ3 ఎయిర్ క్రాస్ రెండు మోడళ్లలోనూ ఈ లిమిటెడ్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ బ్లూ ఎడిషన్ యూనిక్ కాస్మో బ్లూ ఎక్స్ టీరియర్ కలర్, యాక్సెంచ్యుయేటెడ్ బాడీలైన్, రూఫ్ గ్రాఫిక్స్ వంటివి ఉంటాయి. అలాగే ఇంటీరియర్ లో ఎయిర్ ప్యూరిఫైయర్, ఇల్యూమినేటెడ్ కప్ హోల్డర్స్, సిల్ ప్లేట్స్, కస్టమైజ్డ్ సీట్ కవర్స్, నెక్ రెస్ట్స్, సీట్ బెల్ట్ కూషన్స్ అందుబాటులో ఉంటాయి.

సిట్రోయిన్ సీ3 స్పెసిఫికేషన్లు..

సిట్రోయిన్ సీ3 కారు రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ 1198 సీసీ ఇంజిన్, 5 స్పీడ్ ఎంటీ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇది 80బీహెచ్పీ శక్తిని 115ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 లీటర్(1199సీసీ) ఇంజిన్ 6 స్పీడ్ ఎంటీ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇది 108బీహెచ్పీ శక్తిని, 190ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ స్పెసిఫికేషన్లు..

ఈ సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 6 స్పీడ్ ఎంటీతో వచ్చే ఈ ఇంజిన్ 108బీహెచ్పీ శక్తిని 190ఎన్ఎం గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6 స్పీడ్ ఏటీ ఇంజిన్ 205ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..