
భారతదేశంలో సీ3 కొత్త స్పోర్ట్ ఎడిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు సిట్రోయెన్ ప్రకటిచింది. ఈ కారు ఇతర ప్రామాణిక వేరియంట్ల కంటే రూ. 21,000 తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా లుక్స్ పరంగా ఈ కారు అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే అధునాత ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. సీ3 స్పోర్ట్ ఎడిషన్లో ‘స్పోర్ట్స్’ డెకాల్స్, స్పోర్టీ మెటల్ పెడల్స్, యాంబియంట్ లైటింగ్, థీమ్లోకి వచ్చే ఇంటీరియర్ ట్వీన్స్‌తో ఆకట్టుకుంటుంది.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే మృదువైన సీట్బెల్ట్ కుషన్లు, మ్యాచింగ్ ఫ్లోర్ మ్యాట్లు ఉన్నాయి. కొత్త గార్నెట్ రెడ్ బాడీ కలర్ కూడా ఉంది. ఈ కలర్ కారణంగా ఈ వెర్షన్‌కు బోల్డ్ వైబ్‌ను జోడిస్తుంది. ఈ కారు మూడు ట్రిమ్లలో లభిస్తుంది. బేస్ లైవ్ వేరియంట్‌కు రూ. 6.44 లక్షలు, ఫీల్‌కు రూ. 7.73 లక్షలు, టాప్- స్పెక్ షైన్‌కు రూ. 8.37 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). అయితే వైర్లెస్ ఛార్జర్, డాష్ క్యామ్‌తో కూడిన ఐచ్ఛిక యాడ్ ఆన్ కిట్‌ను రూ.15,000 చెల్లించి పొందాల్సి ఉంటుంది.
స్పోర్ట్ ఎడిషన్ హుడ్ కింద ఎలాంటి మార్పులు ఉండవు. అయితే సుపరిచితమైన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. బేసిక్ వేరియంట్ 82 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండగా టర్బోచార్జ్‌ను వెర్షన్ 110 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు వేరియంట్లు వాటి పెప్పీ సిటీ పనితీరుతో పాటు సులభంగా డ్రైవింగ్ చేయగల సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందాయి. సిట్రోయెన్ ప్రకారం స్పోర్ట్ ఎడిషన్ సీ3 కి మరింత “శక్తి-థ్రిల్” తీసుకురావడానికి ఉద్దేశించి రూపొందించారు. మృదువైన ప్రయాణంతో పాటు బోల్డ్ స్టైలింగ్ ఆకట్టుకుంటుంది. ఇది పెద్ద మార్పు కానప్పటికీ ఈ చిన్న అప్‌గ్రేడ్స్ వల్ల కారు మరింత స్పోర్టీ లుక్‌తో ఆకర్షిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..