IRDAI New Rules: జీవిత బీమాతో ఆ సమస్యకు చెక్..రూల్స్ మార్చిన ఐఆర్డీఏఐ

|

Jun 17, 2024 | 8:30 AM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బీమా పాలసీలు ఉంటున్నాయి. అయితే వాటి ద్వారా లోన్ పొందాలంటే మాత్రం కొన్ని బీమా పాలసీలకే ఆ ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రస్తుతం అన్ని జీవిత బీమా పొదుపు ఉత్పత్తులు ఇప్పుడు తప్పనిసరిగా పాలసీ లోన్ ఎంపికతో ఉండాలని అవసరమైనప్పుడు పాలసీదారులకు లోన్ యాక్సెస్ చేయడానికి వీలు కల్పించాల్సిందేనని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఇటీవల ప్రకటించింది.

IRDAI New Rules: జీవిత బీమాతో ఆ సమస్యకు చెక్..రూల్స్ మార్చిన ఐఆర్డీఏఐ
Insurance
Follow us on

ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ సాధారణ విషయంగా మారింది. అయితే లోన్ తీసుకునే సమయంలో తాకట్టు అనేది పెద్ద ప్రహసనంగా మారింది. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంటేషన్ సమస్యలతో ఎవరూ ముందుకు రారు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బీమా పాలసీలు ఉంటున్నాయి. అయితే వాటి ద్వారా లోన్ పొందాలంటే మాత్రం కొన్ని బీమా పాలసీలకే ఆ ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రస్తుతం అన్ని జీవిత బీమా పొదుపు ఉత్పత్తులు ఇప్పుడు తప్పనిసరిగా పాలసీ లోన్ ఎంపికతో ఉండాలని అవసరమైనప్పుడు పాలసీదారులకు లోన్ యాక్సెస్ చేయడానికి వీలు కల్పించాల్సిందేనని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ నూతన రూల్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జీవిత బీమా పాలసీలకు సంబంధించిన అన్ని నిబంధనలను ఏకీకృతం చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్‌లో బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా పాలసీదారులకు నిబంధనలు, షరతులను సమీక్షించడానికి ఉచిత లుక్ వ్యవధిని 15 రోజుల నుండి 30 రోజులకు పొడిగించినట్లు ప్రకటించింది. తాజా మాస్టర్ సర్క్యులర్ సాధారణ బీమా పాలసీల కోసం రెగ్యులేటర్ చేసిన ఇదే విధమైన కసరత్తును అనుసరిస్తుంది. బీమా నియంత్రణ సంస్థ పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన సంస్కరణల శ్రేణిలో ఇది ఒక ముఖ్యమైన దశగా ఉంటుంది. ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడానికి కస్టమర్ అనుభవాన్ని, సంతృప్తిని మెరుగుపరచడానికి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు సులభతరం చేశామని ఐఆర్‌డీఏఐ తెలిపింది. 

ఉన్నత విద్య లేదా పిల్లల వివాహం వంటి ముఖ్యమైన జీవిత సంఘటనల కోసం పాలసీదారులు వారి నిర్దిష్ట ఆర్థిక అవసరాలను తీర్చేందుకు వీలుగా పెన్షన్ ఉత్పత్తుల కింద పాక్షిక ఉపసంహరణ సౌకర్యం అనుమతించాలని ఐఆర్‌డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. నివాస గృహం/ఫ్లాట్ కొనుగోలు/నిర్మాణం, వైద్య ఖర్చులు, తీవ్రమైన అనారోగ్యం చికిత్సలకు ఇకపై బీమా పాలసీ ద్వారా లోన్ పొందవచ్చు. పాలసీల సరెండర్ విషయంలో సరెండర్ చేసే పాలసీదారులు, కొనసాగుతున్న పాలసీ హోల్డర్లు వారు పెట్టిన పెట్టుబడికి విలువ ఉండేలా చూడాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. అలాగే ఐఆర్‌డీఏఐ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ అవార్డుపై బీమా సంస్థ అప్పీల్ చేయకపోతే మరియు 30 రోజులలోపు దానిని అమలు చేయకపోతే ఫిర్యాదుదారునికి రోజుకు రూ. 5,000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి