Recharge Plans: ఈ ప్లాన్స్‌తో సంవత్సరమంతా రీచార్జ్ బాధలకు చెక్.. ది బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ఇవే..!

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ప్రతి ఇంటికి రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయంటే వీటి వాడకం ఎలా ఉందో? మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను తరచూ రీచార్జ్ సమస్య వేధిస్తూ ఉంటుంది. రీచార్జ్ సమస్యలకు చెక్ పెడుతూ 365 రోజుల వ్యాలిడిటీ అంటే సంవత్సరం వరకు రీచార్జ్ బాధ లేని ప్లాన్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Recharge Plans: ఈ ప్లాన్స్‌తో సంవత్సరమంతా రీచార్జ్ బాధలకు చెక్.. ది బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ఇవే..!
Phone Talking

Updated on: Mar 03, 2025 | 1:15 PM

తరచుగా రీఛార్జ్ చేసుకునే బాధ నుంచి బయటపడేందుకు 365 రోజుల ప్లాన్‌లు సరైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జియో టెలికం కంపెనీయే తక్కువ మొత్తంలో సంవత్సరం వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్స్ అందిస్తుంది. అయితే ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్‌ఎన్ఎల్ టెలికం కంపెనీలు కూడా చౌకైన 365 రోజుల ప్లాన్‌లను అందిస్తున్నారు. రూ. 2000 కంటే తక్కువ ధరతో ఉన్న ఈ కంపెనీల 365 రోజుల ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంవత్సరం వ్యాలిడిటీతో వచ్చే రీచార్జ్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్‌తో వాయిస్, ఎస్ఎంఎస్ సేవలను ఆశ్వాదించవచ్చు. ఈ ప్లాన్‌లో ఎలాంటి డేటా అందించరు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. దీనితో పాటు మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. స్పామ్ కాల్, ఎస్ఎంఎస్ వార్నింగ్స్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్‌లు వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. 

వీఐ రూ. 1999 ప్లాన్

ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌ను ఆశ్వాదించవచ్చు. అయితే ఈ ప్లాన్ ద్వారా 24 జీబీ డేటాను కూడా అందిస్తున్నారు. అలాగే 3600 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీఐ రూ. 1849 ప్లాన్

వీఐ రూ.1849 ప్లాన్ వాయిస్, ఎస్ఎంఎస్‌లను మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌తో పాటు మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ఇతర అదనపు ప్రయోజనాలను అందించదు. 

బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్లాన్

ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు మొత్తం 24 జీబీ డేటాను పొందవచ్చు. 

బీఎస్ఎన్ఎల్ రూ. 1999 ప్లాన్

ఈ ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 365 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 600 జీబీ డేటాను ఆశ్వాదించవచ్చు. అన్ని ప్లాన్‌ల మాదిరిగానే ఈ ప్లాన్‌లో కూడా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. 

బీఎస్ఎన్ఎల్ రూ.1198 ప్లాన్

ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రతి నెలా 300 నిమిషాల కాల్స్, మొత్తం 3 జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి