అప్పుల భారం తగ్గించుకోవాలా? అయితే ChatGPT సహాయం తీసుకోండి! మీ అప్పులన్నీ మాయం!
అప్పులు, ఆర్థిక ఒత్తిడితో బాధపడుతున్నారా? చాట్‌జీపీటీ (ChatGPT) మీకు అద్భుతమైన మార్గదర్శి కాగలదు. మీ ఆదాయం, ఖర్చులు, అప్పుల వివరాలు అందిస్తే, ఇది సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందిస్తుంది. అధిక వడ్డీ అప్పుల చెల్లింపు, బడ్జెట్ తయారీ, అత్యవసర నిధి ఏర్పాటు వంటి వ్యూహాలను సూచిస్తుంది.

అప్పులు, ఆర్థిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారికి కొంతమంది ఆర్థిక సాయం చేయలేకపోవచ్చు. కానీ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు అద్భుతమైన సలహాను ఇస్తుంటారు. అది కూడా కొన్ని లక్షలతో సమానం. మీరు కూడా అప్పులతో బాధపడుతుంటే, మీకున్న ఆదాయంతో వాటిని ఎలా తీర్చాలో అర్థంకాక సతమతం అవుతుంటే.. ChatGPT సాయం తీసుకోండి. మీ అప్పులు, ఆదాయం, ఈఐఎంలు, ఖర్చులు అన్నీ దానికి వివరంగా చెప్పండి. అది మీకు ఒక మంచి ప్రణాళిక వేసి ఇస్తుంది. జెస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు. సరైన విధంగా ఉపయోగిస్తే, అప్పుల భారం తగ్గించుకోవడానికి మంత్లీ బడ్జెట్ తయారీలో చాట్‌జీపీటీ సహకారం పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మొదటగా వినియోగదారుడు తన నెలవారీ ఆదాయం, స్థిర ఖర్చులు (ఇల్లు అద్దె, EMIలు, విద్యుత్, ఫీజులు), మారే ఖర్చులు (ఆహారం, రవాణా, వినోదం) వంటి వివరాలను స్పష్టంగా ఇవ్వాలి. అలాగే మొత్తం అప్పుల వివరాలు.. ఎంత మొత్తం, వడ్డీ రేటు, నెలవారీ EMI—తెలియజేస్తే, చాట్‌జీపీటీ వాటిని వర్గీకరించి సమగ్ర బడ్జెట్ నమూనాను సూచిస్తుంది.
నిపుణుల ప్రకారం.. మొదట అత్యధిక వడ్డీ ఉన్న అప్పులను తీర్చడం లేదా స్నోబాల్ పద్ధతి వంటి వ్యూహాలను చాట్‌జీపీటీ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు. అదనంగా ఖర్చులను ఎక్కడ తగ్గించవచ్చో, ఎంత మొత్తాన్ని అత్యవసర నిధిగా నిల్వ ఉంచాలో కూడా సూచనలు పొందవచ్చు. అయితే అందించిన సమాచారం నిజమైనదిగా ఉండాలి. వ్యక్తిగత డేటాను పంచుకునేటప్పుడు జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా వినియోగిస్తే, చాట్‌జీపీటీ వ్యక్తిగత ఆర్థిక నియంత్రణకు డిజిటల్ మార్గదర్శిగా మారి, అప్పుల నుండి బయటపడేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఈ విధంగా తమ అప్పులు తీర్చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
