Housing Trends: మారుతున్న గృహ కొనుగోలుదారుల ఆలోచనలు.. ముచ్చటగా మూడు బెడ్ రూమ్స్ కావాల్సిందే..!

పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్ కల్చర్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సొంత ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారు త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతున్నారు. తాజా ఎఫ్ఐసీసీఐ అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వేలో అత్యధిక గృహ కొనుగోలుదారుల డిమాండ్ ఇప్పుడు త్రీ బీహెచ్‌కేలకు ఉందని కనుగొన్నారు. దాదాపు 50 శాతం మంది కొనుగోలుదారులు త్రీ బీహెచ్‌కేలను ఇష్టపడుతున్నారు.

Housing Trends: మారుతున్న గృహ కొనుగోలుదారుల ఆలోచనలు.. ముచ్చటగా మూడు బెడ్ రూమ్స్ కావాల్సిందే..!
Housing Market

Updated on: Mar 08, 2024 | 8:00 AM

సొంతింటి కలను సాకారం చేసుకోవడం అనేది ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు హోమ్ లోన్ తీసుకుని మరీ ఇంటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్ కల్చర్ నేపథ్యంలో గృహ కొనుగోలుదారుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సొంత ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారు త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతున్నారు. తాజా ఎఫ్ఐసీసీఐ అనరాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వేలో అత్యధిక గృహ కొనుగోలుదారుల డిమాండ్ ఇప్పుడు త్రీ బీహెచ్‌కేలకు ఉందని కనుగొన్నారు. దాదాపు 50 శాతం మంది కొనుగోలుదారులు త్రీ బీహెచ్‌కేలను ఇష్టపడుతున్నారు. అలాగే 38 శాతం మంది 2 బీహెచ్‌కేలను ఇష్టపడుతున్నారు. హెచ్2 2022 సర్వే ఎడిషన్‌లో కూడా త్రీ బీహెచ్‌కేల డిమాండ్ 42 శాతంగా ఉంది. కొనుగోలుదారుల తాజా డిమాండ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ పెద్ద అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్ నిరంతరం కొనసాగుతోంది. 3 బీహెచ్‌కేలకు ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉంది. హైపర్ ప్రైసీ ఎంఎంఆర్‌లో 44 శాతం మంది కొనుగోలుద2 బీహెచ్‌కేలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే పూణేలో మాత్రం 10 శాతం 1 బీహెచ్‌కేలను ఇష్టపడుతున్నారు. ఈ సర్వేను అనరాక్ రీసెర్చ్ జూలై నుంచి డిసెంబర్ 2023 మధ్య సుమారుగా నిర్వహించింది. దాదాపు 5,510 మంది ఆన్‌లైన్ కొనుగోలుదారుల డేటాను విశ్లేషించింది. అలాగే ఈ సర్వేలో రూ. 1.5 కోట్ల ధరతో కూడిన లగ్జరీ గృహాల డిమాండ్ కూడా పెరుగుతున్నట్లు కనుగొంది. అలాగే 33 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షల మధ్య ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. 

ఇవి కూడా చదవండి

సర్వేలో వివిధ కొనుగోలుదారుల అభిప్రాయాలివే

  • ఆస్తి కొనుగోలుదారు 75 శాతం మంది వరకూ బాల్కనీలు లేకపోయినా ఇంటి లోపల మాత్రం ఎక్కువ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 
  • గృహ కొనుగోలుదారులలో 74 శాతం మంది నిర్మాణ నాణ్యతను కోరుకుంటున్నారు.
  • అయితే చాలా మంది కొనుగోలుదారులు ఇంటిని రీ సేల్ చేసినప్పుడు వచ్చే ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. 
  • ఎఫ్‌డీల్లో పెట్టుబడి కంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అధిక రాబడినిస్తుందని, అందువల్ల ఇంటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నామని మరికొంత మంది కొనుగోలుదారులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి