Aadhaar-Ration card: రేషన్‌ కార్డు దారులకు కేంద్రం ఊరట.. ఆధార్‌తో లింక్‌ చేయడానికి గడువు పెంపు.

|

Mar 26, 2023 | 8:41 PM

రేషన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆధార్‌, పాన్‌ కార్డ్‌ అనుసంధానించడాన్ని తప్పనిసరి చేసిన కేంద్రం.. ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డును కూడా లింక్‌ చేయాలని తెలిపింది. రేషన్‌ కార్డు ద్వారా సబ్సిడీపై..

Aadhaar-Ration card: రేషన్‌ కార్డు దారులకు కేంద్రం ఊరట.. ఆధార్‌తో లింక్‌ చేయడానికి గడువు పెంపు.
Aadhar Ration Card Link
Follow us on

రేషన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆధార్‌, పాన్‌ కార్డ్‌ అనుసంధానించడాన్ని తప్పనిసరి చేసిన కేంద్రం.. ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డును కూడా లింక్‌ చేయాలని తెలిపింది. రేషన్‌ కార్డు ద్వారా సబ్సిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, గోదుమలు వంటి నిత్యావసర సరుకులు అందిస్తాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేషన్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఆధార్‌ కార్డుతో రేషన్‌ కార్డు లింక్‌ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది.

నిజంగా అర్హత ఉన్న వారికే లబ్ధి చేకూరడంతో పాటు, డూప్లికేట్‌ రేషన్‌ కార్డులను గుర్తించవచ్చనేది కేంద్రం అభిప్రాయం. ఇదిలా ఉంటే ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డును లింక్‌ చేయడానికి తొలుత కేంద్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. అయితే తాజాగా ఈ డెడ్‌లైన్‌ను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఆధార్‌, రేషన్‌ కార్డ్‌ లింకేజ్‌ డెడ్‌లైన్‌ను జూన్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ తాజాగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌లోనే మీ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డును సింపుల్‌ స్టెప్స్‌ ద్వారా లింక్‌ చేసుకోవచ్చు.

ఇలా లింక్‌ చేసుకోండి..

* ఇందుకోసం ముందుగా స్టేట్స్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (పీడీఎస్‌) పోర్టల్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ఆధార్‌ కార్డు నెంబర్‌, రేషన్‌ కార్డ్‌ నెంబర్‌, రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ వంటి వివరాలను అందించారు.

* ఆ తర్వాత మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాలి.

* ఇలా ఆధార్‌ను, రేషన్‌ కార్డుతో లింక్‌ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో ఇలా..

ఆఫ్‌లైన్‌ విధానంలో మీ రేషన్‌ కార్డుతో ఆధార్‌ను లింక్‌ చేయాలనుకుంటే.. ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డుల జిరాక్స్‌లను, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటివి వాటిని రేషన్ ఆఫీస్‌కు లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా రేషన్ షాపు యజమానికి అందిస్తే సరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..