
జియో కస్టమర్లు ఇటీవల చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ల కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోజువారీ అపరిమత కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు వచ్చే చౌకైన డేటా ప్యాక్స్‌ను ఇష్టపడుతున్నారు. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉండి తక్కువ సొమ్ముతో మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే జియో మంచి ఆప్షన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ ప్రతిచోటా అందుబాటులో ఉంటుందని, ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షించేందుకు జియో ఇతర నెట్ వర్క్స్ కంటే చౌకైన రీచార్జీ ప్లాన్స్ ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో జియో చౌకైన రీచార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
రిలయన్స్ జియో రూ.799 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంటర్నెట్‌ను ఉపయోగించేందుకు రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్, డైలీ 100 ఎస్ఎంఎస్ వస్తాయి.అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్లను కూడా పొందవచ్చు.
జియో రూ.859 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో ఈ జియో ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. అలాగే ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను పంపుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అలాగే అపరిమిత 5జీ డేటా, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.
రిలయన్స్ జియో రూ. 889 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికి వస్తే అపరిమిత కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 2 జీబీతో పాటు 20 జీబీ అదనపు డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా జియో వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా మొత్తం 200 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంస్‌లు కూడా లభిస్తాయి. జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి