ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇంటి వద్ద నుంచే రూ. 10 వేలు నగదు పొందొచ్చు.. ఎలాగంటే.!

|

Feb 15, 2021 | 7:10 PM

SBI Door Step Banking: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 41 కోట్ల మంది వినియోగదారుల కోసం సరికొత్త సౌకర్యాన్ని..

ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇంటి వద్ద నుంచే రూ. 10 వేలు నగదు పొందొచ్చు.. ఎలాగంటే.!
Follow us on

SBI Door Step Banking: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 41 కోట్ల మంది వినియోగదారుల కోసం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే రూ. 10 వేల వరకు నగదు వరకు పొందొచ్చు. దీనికోసం కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయడం గానీ.. మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

నగదు డెలివరీ కాకుండా, ఇంటి వద్ద నుంచే మరిన్ని సౌకర్యాలను ఎస్బీఐ(State Bank Of India) ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. చెక్, డ్రాఫ్ట్, పే ఆర్డర్ సేవలు మాత్రమే కాకుండా KYC పత్రాలను సేకరించడం, లైఫ్ సర్టిఫికెట్స్ సేకరించడం, ఫారం 15Hను సమర్పించడం వంటి సౌకర్యాలను ఖాతాదారులు ఇంటి వద్ద నుంచే పొందుతున్నారు. ఈ సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా మీరు రోజుకు 20 వేల నగదును ఉపసంహరించుకోవడం/జమ చేయవచ్చు. అయితే ఈ సేవలకు అదనపు ఛార్జీలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చేస్తే, రూ .100, ఆర్థికేతర సేవలకు రూ. 60 ఛార్జీ చేయనుండగా.. జీఎస్టీ ఛార్జీలు విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సౌకర్యాన్ని ఎవరు పొందగలరు?

డోర్ స్టెప్ బ్యాంకింగ్‌కు సంబంధించి ఎస్బీఐ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కీలకమైన సమాచారాన్ని అధికారులు పొందుపరిచారు. ఈ సదుపాయాన్ని 70 ఏళ్లు పైబడిన వృద్ధులు వికలాంగులు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా KYC కంప్లైంట్ ఖాతాదారులు కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ సౌకర్యం కోసం మీ మొబైల్ నంబర్‌ను ఖాతాకు జత చేయాల్సిన అవసరం ఉంది. జాయింట్ అకౌంట్, మైనర్ల ఖాతాలు, నాన్-పర్సనల్ ఖాతాలకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు. అలాగే కస్టమర్, తన హోమ్ బ్రాంచ్ నుండి ఐదు కిలోమీటర్ల లోపల ఉండాలి. అటు ఇంటి చిరునామా, బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన చిరునామాతో మ్యాచ్ అయి ఉండాలి.

ఈ సౌకర్యాన్ని పొందండి ఇలా.?

ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్- 1800 1037 188 లేదా 1800 1213 721కు కాల్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అలాగే www.psbdsb.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ సేవను పొందండి. అటు ఫోన్‌లో డిఎస్‌బి మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందండి.