PM Garib Kalyan Anna Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి నెలా ఒక కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేస్తారు. ఈ పథకంలో 80 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని గతంలో ప్రభుత్వం సూచించింది. దీంతో కేబినెట్‌ ఆమోదించింది. పిఎమ్‌జికెఎవై పథకం ద్వారా వచ్చే 5 సంవత్సరాలకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు..

PM Garib Kalyan Anna Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు
Pm Garib Kalyan Anna Yojana

Updated on: Nov 30, 2023 | 12:28 PM

PM Garib Kalyan Anna Yojana: దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పేదలకు రేషన్ పంపిణీ చేస్తున్న పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదేళ్లపాటు పొడిగించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2028 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 31తో ముగియనుంది. ఈ పథకం జనవరి 1 నుంచి కొనసాగుతుంది.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి నెలా ఒక కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందజేస్తారు. ఈ పథకంలో 80 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ఈ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని గతంలో ప్రభుత్వం సూచించింది. దీంతో కేబినెట్‌ ఆమోదించింది. పిఎమ్‌జికెఎవై పథకం ద్వారా వచ్చే 5 సంవత్సరాలకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ. 11.8 లక్షల కోట్లుగా అంచనా వేసింది కేంద్రం. ఇంతకుముందు ఆహార భద్రత చట్టం కింద రేషన్ పథకం ఉన్న విషయం తెలిసిందే. దీని కింద ప్రతినెలా 5 కిలోల ఆహార ధాన్యాలను సబ్సిడీపై పంపిణీ చేశారు.

అయితే, 2020లో, కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది. డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ అన్నా పథకం ప్రవేశపెట్టింది. దీంతో ఉచిత రేషన్ పంపిణీ చేయనుంది. కోవిడ్ సమయంలో కోట్లాది మందికి ఉచిత రేషన్‌లను పంపిణీ చేసే ఈ పథకాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు సైతం ప్రశంసించాయి.

ఇవి కూడా చదవండి
  • ఇతర ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది
  • మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను అందించే పథకం
  • ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల పథకం వచ్చే మూడేళ్లపాటు కొనసాగుతుంది
  • 16వ ఆర్థిక సంఘం నిబంధనలు
  • ప్రధాన మంత్రి జంజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి