BYD Electric Car: టెస్లా పోటీగా భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 700 కి.మీ మైలేజీ

| Edited By: Anil kumar poka

Jan 12, 2023 | 6:23 PM

ఇదే క్రమంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ కూడా ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించింది. తన స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ ను ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించింది. వచ్చే అక్టోబర్ నుంచి మన దేశంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది.

BYD Electric Car: టెస్లా పోటీగా భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 700 కి.మీ మైలేజీ
Byd Seal
Follow us on

ప్రస్తుతం మార్కెట్ అంతా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం అందరినీ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూసేలా చేస్తోంది. అందుకు తగినట్లుగానే కంపెనీలు విరివిగా పలు మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో చైనాకు చెందిన బీవైడీ కంపెనీ కూడా ఇండియన్ మార్కెట్ లోకి ప్రవేశించింది. తన స్మార్ట్ ఎలక్ట్రిక్ కారు సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ ను ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించింది. వచ్చే అక్టోబర్ నుంచి మన దేశంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు ఆ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కారుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

BYD సీల్ డిజైన్ ఇలా..

కారును బయట నుంచి చూస్తే దాని డిజైన్ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి
పెద్ద ఎల్ఈడీ హెడ్‌లైట్లు, C- ఆకారపు DRLలు ఉంటాయి. సైడ్ ఎయిర్ వెంట్స్, బంపర్ ట్రిమ్ బిట్స్‌లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైటింగ్ ఆకట్టుకుంటుంది. సైడ్ లుక్ లో సీల్ EV ఏరోడైనమిక్ ప్రొఫైల్, ఏరో-స్టైల్ ఫైవ్-స్ప్లిట్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో సొగసైనదిగా కనిపిస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫిష్ స్కేల్‌లను పోలి ఉండేలా తయారు చేయబడిన ఎల్ఈడీ టేల్ లైట్ లు ఉంటాయి. సీల్ ఈవీ ఇ-ప్లాట్‌ఫారమ్ 3.0పై ఆధారపడి ఉంటుంది. ఇది CTB (సెల్-టు-బాడీ) సాంకేతికతను కలిగి ఉంది. ఇది బ్యాటరీ ప్యాక్‌ను కారు బాడీఫ్రేమ్‌లో నిర్మాణాత్మక భాగం చేస్తుంది. ఫలితంగా కారు బరువు బాగా తగ్గుతుంది.

ఫీచర్లు..

సీల్ ఈవీ కారులో రొటేటింగ్ 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే గ్లాస్ రూఫ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ , బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, డ్రైవర్-అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం ఇలా..

భారతదేశంలో సీల్ EV లాంగ్ రేంజ్ వేరియంట్‌ను 82.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 700కిమీల పరిధి వరకు అందిస్తుంది. దీనిలోని డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్‌ట్రెయిన్ (AWD)తో 312PS, 360Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.9 సెకన్ల 0-100kmph ను అందుకుంటుంది.

ధర ఎంత అంటే..

భారతదేశంలో BYD సీల్ EV ధర రూ. 40 లక్షలు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..