Under Construction Property: అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీ కొనుగోలులో ఆ తప్పులు చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే బోలెడంత మనీ సేవ్

|

Jul 06, 2024 | 7:58 PM

ప్రస్తుతం సొంత ఇంటి కొనుగోలు అనేది ప్రతి మనిషికి చిరకాల కోరికగా ఉంటుంది. ఈ కోరిక నెరవేర్చుకోవడానికి పొదుపుతో పాటు గృహ రుణం తీసుకుని మరీ మంచి ఇంటిని కొనుగోలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో పట్టణాలతో పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ నిర్మాణ సమయంలోనే బిల్డర్ సొమ్ము సమకూర్చుకోవడానికి అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడం చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Under Construction Property: అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీ కొనుగోలులో ఆ తప్పులు చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే బోలెడంత మనీ సేవ్
Under Construction Property
Follow us on

ప్రస్తుతం సొంత ఇంటి కొనుగోలు అనేది ప్రతి మనిషికి చిరకాల కోరికగా ఉంటుంది. ఈ కోరిక నెరవేర్చుకోవడానికి పొదుపుతో పాటు గృహ రుణం తీసుకుని మరీ మంచి ఇంటిని కొనుగోలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో పట్టణాలతో పాటు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్ నిర్మాణ సమయంలోనే బిల్డర్ సొమ్ము సమకూర్చుకోవడానికి అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేయడం చాలా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా సొంత ఇంటిని కొనుగోలు చేయవచ్చన వివరిస్తున్నారు. అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్న చందాన కొందరు బిల్డింగ్ కడతామని మన దగ్గర అడ్వాన్స్ తీసుకుని చెప్పిన సమయానికి మనకు బిల్డింగ్‌ను అందించరు. అదీ కాక బ్యాంకులు కూడా మన దగ్గర నుంచి ఈఎంఐ కట్ చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీ కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.

డెవలపర్ విశ్వసనీయత

మీరు నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే డెవలపర్ నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించడం చాలా ముఖ్యం. సకాలంలో ప్రాజెక్ట్ డెలివరీలకు సంబంధించిన నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌తో విశ్వసనీయ బిల్డర్ల దగ్గర ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఉత్తమం. ఆన్‌లైన్ రివ్యూలతో పాటు రిజిస్టర్డ్ డెవలపర్లు మరియు వారి ప్రాజెక్ట్‌ల గురించి విలువైన సమాచారాన్ని అందించే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) వెబ్‌సైట్ వంటి వనరులను ఉపయోగించుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

చట్టపరమైన అనుమతులు, ఆమోదాలు

నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసే ముందుద అవసరమైన అన్ని చట్టపరమైన అనుమతులు, ఆమోదాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. టైటిల్ డీడ్, డెవలపర్ చట్టబద్ధత స్థితి, ఆస్తికి సంబంధించిన చట్టపరమైన స్థితి, భూమిపై డెవలపర్ యాజమాన్యం వంటి కీలక వివరాలను తనిఖీ చేయాలి. ముఖ్యంగా మనం కొనుగోలు చేసే ఆస్థికి సంబంధించిన సర్వే నెంబర్ తీసుకుని ఈసీ తీసుకుని సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ప్రాజెక్ట్ ఆర్థిక పరిస్థితి

ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేయాలి. ఎందుకంటే మంచి ఆర్థిక మద్దతు ఉన్న డెవలపర్‌లు ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ముందుగా డెవలపర్‌కు తగిన నిధులు లేదా విశ్వసనీయమైన ఆర్థిక భాగస్వాములు ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రాజెక్ట్ ఫండింగ్ మూలాలను తనిఖీ చేయాలి. ఇది ప్రాజెక్ట్ ఆర్థికంగా సురక్షితమైనదని భరోసా ఇస్తుంది. అనంతరం నిర్మాణ కాలక్రమాన్ని సమీక్షించాలి. ఒక వివరణాత్మక షెడ్యూల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పురోగతి, ఆశించిన పూర్తి తేదీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలి.

రెగ్యులర్ సైట్ సందర్శన

డెవలపర్‌తో రెగ్యులర్ కమ్యూనికేషన్‌ను నిర్వహించడంతో నిర్మాణ పురోగతిని పర్యవేక్షించడానికి తరచుగా సైట్‌ని సందర్శించడం ఉత్తమం. ఈ సందర్శనలు పనిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. సైట్ సందర్శన వల్ల ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైమ్‌లైన్, నాణ్యతా ప్రమాణాల కొనుగోలుదారుడికి పూర్తి భరోసానిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అవకతవకల గురించి ముందుగా గుర్తించడంలో సహాయపడుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..