Fresho Banana Leaf: కాదేది కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. నేటి వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి ఏదైనా ఒకటే అంటున్నాడు.. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ.. దీంతో డిఫరెంట్ ఆలోచలనతో వ్యాపారస్తులు కస్టమర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిల్లో ఒకటి ఏదీ కావాలన్న ఇంటికే వచ్చే విధంగా పుట్టుకొచ్చిన ఆన్‌లైన్ సైట్లు. ప్రస్తుతం ఆన్‌లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది ఇదని లేదు.. భోగిపిడకల నుంచి అన్ని ఇంటివద్దకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరటి ఆకులను కూడా ఆన్‌లైన్‌లో కూడా అమ్మకానికి పెట్టేశారు.
నిజానికి నాలుగు షాపులు తిరగందే బట్టలు కొనుక్కోని జనం.. ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో పది సైట్లను చూసి కూర్చున్న చోట నుంచే షాపింగ్ చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఏదీకాదు అనర్హం అన్నట్లు ఊళ్లల్లో ఫ్రీగా దొరికే మామిడి ఆకులు, పిడకలు వంటివి కూడా అమ్మేసి బిజినెస్ చేసుకుంటున్నారు.
హిందూ సంప్రదాయంలో అరటి ఆకులు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో అరటి ఆకులు ఈజీగా దొరుకుతాయి. అయితే పట్టణాల్లో , నగరాల్లో అరటి ఆకులు దొరకడం కష్టం దీంతో నగర వాసులు.. పండగలు వస్తే.. అరటి ఆకులు కోసం మార్కెట్ కు పయనమవుతారు. పండగలు పంక్షన్ల వస్తే.. పట్టణవాసులు పూజా సామగ్రితో పాటు.. పువ్వులు, మామిడాకులను, అరటి ఆకులు మార్కెట్లో కొనుగోలు చేస్తారు.. అయితే ఆన్ లైన్ లో నిన్నా మొన్నటి వరకూ.. పూజా వస్తువులనే కాదు.. భోగిపిడకలు , కొబ్బరిచిప్పలు, వేప పుల్లలు, మామిడాకులు అమ్మేవారు. ఇప్పుడు ఆ జాబితాలో..అరటి ఆకులు కూడా చేరాయి. వీటిని కూడా ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు.
తాజాగా అరటి ఆకులు ఇంటికే డెలవరీ చేస్తామంటున్నారు కొన్ని ఆన్‌లైన్ సంస్థలు. ఐదు అరిటాకులు ధర రూ.50 లు అంటూ బిగ్ బాస్కెట్ తమ సైట్‌లో ఆఫర్ పెట్టింది. అయితే ఈ ఐదు ఆకుల అసలు ధర రూ.62.50 అని.. 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం.. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఫ్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: Raw Egg: పచ్చిగుడ్డుని రెగ్యులర్‌గా తాగుతున్నారా.. అయితే మీ శరీరతత్వానికి సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి..