డిగ్రీలు చేసినా.. ఇంట్లో ఖాళీగానే ఉన్నారా..! ఎక్కడా కూడా జాబ్ దొరకట్లేదా.? అయితే ఇది మీకోసమే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ బిజినెస్ ఐడియా ఫాలో అయిపోండి. రిస్క్ ఉండదు.. మినిమం పెట్టుబడి.. వర్కౌట్ అయితే లాభాలే.. లాభాలు. అనువైన చోట మీ వ్యాపారాన్ని ప్రారంభించండి.. సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయండి. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటని అనుకుంటున్నారా.? అయితే ఇవిగో దీటయిల్స్ చూసేయ్యండి..
ఫుడ్ బిజినెస్.. ఇది ఎప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం. ముఖ్యంగా పట్టణాలు, సిటీల్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి.. సక్సెస్‌ఫుల్ కావొచ్చు. అక్కడ చాలామంది ఉద్యోగస్తులు, వ్యాపారం చేసుకునేవారు ఇంట్లో కన్నా.. బయటే ఎక్కువగా తింటుంటారు. అలాంటి వారి కోసం మీరు పరాటా బిజినెస్‌ను స్టార్ట్ చేసేయండి. ఈ మధ్యకాలంలో చాలామంది మధ్యాహ్నం వేళ భోజనం కంటే పరాటాలు, చపాతీలు తింటున్నారు. గోధుమ పిండి పరాటాలతో ఆలుగడ్డ, ముల్లంగి, పనీర్, చికెన్, మటన్ కర్రీలను వాడుతుంటారు. మీరు కూడా మంచి రద్దీ ఉన్న సెంటర్ చూసి.. ఈ పరాటా ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేయండి. ఒక షాపు అద్దెకు తీసుకుని అయినా ప్రారంభించవచ్చు.
ఇక ఈ పరాటా సెంటర్ మొదలుపెట్టేందుకు ముందుగా మీరు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత పరాటాల తయారీకి కావాల్సిన సామాగ్రిని సిద్దం చేసుకోవాలి. వీటికి దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చవుతుంది. కాగా, ఒక పరాటా ధర రూ. 20 అనుకుంటే.. మీరు రోజుకు 100 అమ్మితే.. రూ. 2 వేల వరకు వస్తుంది. ఇక నాన్ వెజ్ పరాటాలైతే అదనంగా ఛార్జీ చేయవచ్చు. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జోమాటోలతో ఒప్పందం కుదుర్చుకుంటే.. ఇంకా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దాదాపు నెలకు రూ. లక్ష వరకు సంపాదన వచ్చే అవకాశం ఉంది.