Budget 2025: ఆదాయపు పన్ను తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

|

Jan 28, 2025 | 9:31 AM

Budget 2025: బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించాలని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. వినియోగం, డిమాండ్‌ను బలోపేతం చేసేందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపుతో ప్రజలు ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు. అలాగే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది వినియోగం, డిమాండ్‌ను పెంచుతుంది..

Budget 2025: ఆదాయపు పన్ను తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌
Follow us on

ఫిబ్రవరి 1న సమర్పించనున్న బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించిన అతిపెద్ద అంచనా. ఆర్థిక మంత్రి తమకు పన్నులో కొంత ఉపశమనం కల్పించాలని, తద్వారా తమ చేతిలో ఎక్కువ డబ్బు ఆదా చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆదాయపు పన్నును తగ్గించాలని పరిశ్రమ నిపుణులు కూడా ప్రభుత్వానికి సూచించారు. వీటన్నింటి మధ్య ఆదాయపు పన్నును తగ్గించవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు.

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గించరాదని రఘురామ్ రాజన్ అన్నారు. బదులుగా దీర్ఘకాలిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో పెట్టుబడిని పెంచాలి. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా వినియోగాన్ని పెంచేందుకు పన్ను తగ్గింపులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో అలాంటి చర్యలకు ఆస్కారం లేదని రాజన్ చెప్పినట్లు ఇండియా టుడే నివేదించింది.

ఇది కూడా చదవండి: February School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లోటును ఎత్తిచూపిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్.. దేశ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదని అన్నారు. జాగ్రత్తగా పరిశీలించకుండా ఖర్చును మరింత పెంచడం అనేది నిలకడలేని రుణ స్థాయిలకు దారి తీస్తుంది. మానవ మూలధన అభివృద్ధిపై సమర్థవంతమైన ప్రజా వ్యయం బదులుగా మెరుగైన ఫలితాలను ఇస్తుందని రాజన్ సూచించారు.

ఉద్యోగాల కల్పన పెద్ద సమస్య:

పన్ను తగ్గింపు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన సమయం ఇది కాదన్నారు. ప్రతి స్థాయిలో మానవ మూలధన నాణ్యతను పెంచడంపై మనం దృష్టి పెట్టాలి. ఇది దేశ భవిష్యత్తును సుసంపన్నం చేస్తుంది. పన్ను విధించడం పెద్ద సమస్య కాదని రఘురామ్ రాజన్ అన్నారు. ఇది ప్రతిసారీ సమీక్షించాలి అనేది నిజమైతే ఉద్యోగ సృష్టిని మనం ఎలా ప్రోత్సహించగలం అన్నది చాలా ముఖ్యమైన సమస్య అని తాను నమ్ముతున్నానని అన్నారు.

ఇది కూడా చదవండి: Google: మీరు గూగుల్‌లో వీటిని సెర్చ్‌ చేస్తున్నారా..? ఇక జైలుకే..!

ఇతర నిపుణులు ఏమి చెబుతారు?

బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించాలని పలువురు నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. వినియోగం, డిమాండ్‌ను బలోపేతం చేసేందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపుతో ప్రజలు ఎక్కువ డబ్బు ఆదా చేస్తారు. అలాగే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది వినియోగం, డిమాండ్‌ను పెంచుతుంది. అలాగే ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. పన్ను తగ్గింపు వల్ల మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుందని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడదని పలువురు చెబుతుండగా, రఘురామ్ రాజన్ మాత్రం పూర్తిగా వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Vehicle Insurance: మీ కారు, బైక్‌కు ఇన్సూరెన్స్ లేదా? ఇక నుంచి నో పెట్రోల్‌, డీజిల్‌.. ఫాస్ట్‌ట్యాగ్‌ కూడా తీసుకోలేరు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి