Budget 2025: ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి శుభవార్త ఉంటుందా? వారికి భారీ ఉపశమనం!

Budget 2025: మొదటి త్రైమాసిక గణాంకాలు ప్రైవేట్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల, పెట్టుబడి కార్యకలాపాలలో స్వల్ప మెరుగుదలని సూచిస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు పూర్తవడంతో ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన..

Budget 2025: ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి శుభవార్త ఉంటుందా? వారికి భారీ ఉపశమనం!

Updated on: Feb 01, 2025 | 8:05 AM

బడ్జెట్ 2025 అనేక విధాలుగా చాలా చారిత్రాత్మకమైనది. దీనికి మొదటి ముఖ్యమైన కారణం ఏమిటంటే, దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్‌లను సమర్పించిన మొదటి ఆర్థిక మంత్రిగా అవతరించడం. అంతేకాకుండా దేశంలోని మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేసే ప్రకటన ఈ బడ్జెట్‌లో చేయవచ్చు. ఇది కాకుండా, దేశం మందగమన ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి అనేక ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చు. అయితే ఆమె ప్రకటించే వాటిలో దేశంలోని ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌డం అత్యంత ప్ర‌ధాన అంశం. దేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్నులో పెద్ద మినహాయింపు పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఉపశమనం లభించవచ్చు:

బడ్జెట్‌లో భాగంగా ద్రవ్యోల్బణం, జీతాల పెరుగుదల స్తబ్దతతో పోరాడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఆదాయపు పన్ను రేటు/శ్లాబ్‌ను తగ్గించడం లేదా మార్చడం జరుగుతుంది. ఆర్థిక లోటును తగ్గించే ముసాయిదాకు కట్టుబడి, ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో బలహీనపడుతున్న ఆర్థిక వృద్ధికి మద్దతుగా చర్యలు తీసుకోవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపుపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వారికి బడ్జెట్‌లో కొంత ఊరట లభించవచ్చు.

ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది:

డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కీ మజుందార్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసిక గణాంకాలు ప్రైవేట్ వినియోగంలో గణనీయమైన పెరుగుదల, పెట్టుబడి కార్యకలాపాలలో స్వల్ప మెరుగుదలని సూచిస్తున్నాయి. భారతదేశంలో ఎన్నికలు పూర్తవడంతో ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని, రాబోయే త్రైమాసికాల్లో వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన దిశగా ప్రయత్నాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

కాపెక్స్ 20 శాతం పెరుగుతుందని అంచనా:

ఎర్నెస్ట్ అండ్‌ యంగ్ (EY) ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి మూలధన వ్యయం కనీసం 20 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డికె శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సవాళ్లతో కూడిన ఆర్థిక దృష్టాంతంలో రాబోయే బడ్జెట్ ఆర్థిక నియంత్రణను వృద్ధి చర్యలతో సమతుల్యం చేయాలని అన్నారు. డిబిఎస్ సీనియర్ ఆర్థికవేత్త రాధికారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణ మార్గానికి కట్టుబడి, ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉండటం ద్వారా స్థూల స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వగలదని అన్నారు.

ఇది కూడా చదవండి: Bank Holidays In February 2025: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో అంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి