Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు

|

Jul 23, 2024 | 11:45 AM

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించారు...

Budget 2024: బడ్జెట్‌లో ఏపీకి వరాల జల్లు.. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు
Nirmala Sitharaman
Follow us on

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన, అమరావతికి రూ.15 వేల కోట్లతో ప్రత్యేక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే ఆర్థికవృద్ధి కోసం అదనపు కేటాయింపులు ఉంటాయన్నారు.

అలాగే, పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు నిర్మలమ్మ తెలిపారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.


వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి చేయనున్నట్లు.. అలాగే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని, స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచినట్లు వెల్లడించారు. రూ.26 వేల కోట్లుతో బిహార్‌లో నూతన హైవేలు, వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.


ఇది కూడా చదవండి: Indian Railways: రైలు లీటర్‌ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి