
BSNL: దీపావళి సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. పరిమిత కాల ఆఫర్ సరసమైన ధరకు 365 రోజుల సర్వీస్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందే వినియోగదారులు బిఐటివి సబ్‌స్క్రిప్షన్‌తో పాటు పూర్తి సర్వీస్‌ను పొందుతారు. బీఎస్‌ఎన్‌ఎల్ తన దీపావళి బొనాంజా ఆఫర్‌ను ప్రారంభించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు ఈ కొత్త ఆఫర్ వచ్చింది.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు శుభవార్త.. భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ధర ఎంతంటే..
ఈ ఆఫర్ ఈ సంవత్సరం అక్టోబర్ 18 నుండి నవంబర్ 18 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ సేవ కొత్త సీనియర్ సిటిజన్లను మాత్రమే. ఆఫర్ ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఆఫర్ కాలంలో అర్హత కలిగిన వినియోగదారులు 365 రోజుల సేవను పొందుతారు. అంతేకాకుండా ఆఫర్ కింద రోజుకు 2 GB డేటా సేవ అందుబాటులో ఉంటుంది. అదనంగా వినియోగదారులు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS, ఉచిత సిమ్, 6 నెలల పాటు BITV సభ్యత్వాన్ని పొందవచ్చు. ఆఫర్ మొత్తం రూ.1812. అంటే నెలకు రూ. 149 మాత్రమే.
ఇది కూడా చదవండి: Top Electric Scooters: లక్ష రూపాయల లోపు 5 అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్.. బెస్ట్ మైలేజీ!
దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఆ ఆఫర్ కొత్త వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. కానీ దీనికి వయోపరిమితి లేదు. అర్హత కలిగిన వినియోగదారులు ఒక రూపాయి నామమాత్రపు రుసుముతో నెల మొత్తం 4G సేవను పొందవచ్చు. దీని ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4G నెట్‌వర్క్‌ను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా వారు అదనపు ఖర్చు లేకుండా 30 రోజుల పాటు నెట్‌వర్క్‌ను పొందుతారు. ఈ ఆఫర్ బిఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్ కవరేజ్, సేవలను పూర్తిగా అనుభవించడానికి ఉద్దేశించింది. ఈ ఆఫర్ లక్షణాలు భారతదేశంలో ఎక్కడికైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS, ఉచిత సిమ్ కార్డ్.
ఇది కూడా చదవండి: SUV Scooter: భారతదేశపు మొట్టమొదటి SUV స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి