BSNL: ఇకపై విమానాల్లోనూ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్‌ సేవలు: అనుమతులు దక్కించుకున్న బీఎస్‌ఎన్ఎల్‌

|

Oct 21, 2021 | 3:47 PM

విమానాల్లోని ప్రయాణికులకు హై స్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్‌ సేవలు.....

BSNL: ఇకపై విమానాల్లోనూ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్‌ సేవలు: అనుమతులు దక్కించుకున్న బీఎస్‌ఎన్ఎల్‌
Bsnl
Follow us on

విమానాల్లోని ప్రయాణికులకు హై స్పీడ్‌ బ్రాడ్‌ బ్యాండ్ ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సిద్ధమైంది. ఇందుకోసం అవసరమైన అనుమతులను టెలికాం విభాగం నుంచి తాజాగా పొందింది. ఇండియాలో గ్లోబల్‌ ఎక్స్‌ప్రెస్‌ (జీఎక్స్‌) మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అందించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామి సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుమతులు దక్కాయని బ్రిటిష్‌ శాటిలైట్‌ సంస్థ ఇన్‌మార్‌శాట్‌ వెల్లడించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పొందిన ఇన్‌ఫ్లయిట్‌, మారిటైమ్‌ కనెక్టివిటీ లైసెన్సులతో ప్రభుత్వం, విమానయాన, నౌకాయానానికి చెందిన కస్టమర్లకు జీఎక్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఇన్‌మార్‌శాట్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పుర్వార్‌ మాట్లాడుతూ నవంబర్‌ నుంచి ఈ సేవలు అందిస్తామన్నారు. అయితే వీటి టారిఫ్‌ ప్లాన్స్‌ల గురించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు.

బోయింగ్‌ విమానంతో ప్రారంభిస్తాం!
జీఎక్స్‌ సేవలకు సంబంధించి ఇప్పటికే స్పైస్‌జెట్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఇన్‌మార్‌శాట్‌. ఇక తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ పొందిన లైసెన్సులతో మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు వేగంగా నెట్‌ బ్రౌజింగ్‌ చేసుకోవచ్చు. తమ సోషల్‌ మీడియా ఖాతాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ మెయిల్స్‌ను పంపుకోవచ్చు. వివిధ రకాల యాప్స్‌ను ఉపయోగించి వాయిస్‌ కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ‘ప్యాసింజర్‌ ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీ సేవల్లో అంతర్జాతీయంగా పేరొందిన జీఎక్స్‌ సేవలు మన దేశానికి విస్తరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది చివరి నుంచి మా వినియోగదారులకు ఈ సేవలు అందించాలని ప్లాన్‌ చేస్తున్నాం. కొత్త బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానంతో వీటిని మొదలు పెడతాం’ అని స్పైస్‌జెట్‌ ఎండీ గౌతమ్‌ శర్మ తెలిపారు.

Also Read:

Petrol Price: వినియోగదారులకు మరింత మోత.. పెట్రోల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.. కారణాలు ఏమిటంటే..

Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Apple Watch: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? వీడియో