BSNL New Broadband Plans: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగుల కోసం బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌ని మరింత సులభతరం చేయడానికి భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సూపర్ ఫాస్ట్ స్పీడ్‌తో అధిక డేటాను అందించే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ను ప్రారంభించింది. నెట్‌వర్కింగ్ రంగంలోకి ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ అత్యంత తక్కువ ధరకే ప్లాన్స్‌ను అనౌన్స్ చేసింది. రూ. 449 ప్లాన్‌తో పాటు.. మరికొన్ని ధరలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ ఫైబర్ రూ. 449 ప్లాన్..
బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన చౌనైక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇది. రూ.449 ధరతో 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పాటు.. 3.3టీబి డేటా, అపరిమిత కాలింగ్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్ వంటి ఇతర ప్రయోజనాలు అందిస్తోంది. రూ. 449 ప్లాన్‌తో ప్రతీ ఫీచర్‌ను సరమైన ధరలకు అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడంపై బిఎస్ఎన్ఎల్ దృష్టి సారించింది.
భారత్ ఫైబర్ రూ. 799 ప్లాన్..
బిఎన్‌ఎస్‌ఎల్ భారత్ ఫైబర్ నుండి రెండవ ప్లాన్ ధర రూ. 799. హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. 3.3 టిబితో పాటు ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్, అపరిమిత కాలింగ్, మరికొన్ని ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో వినియోగదారులు 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను వినియోగించుకోవచ్చు.
భారత్ ఫైబర్ రూ. 999 ప్లాన్..
బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 999 ప్లాన్‌లో 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3.3 టిబి డేటాను అందిస్తోంది. ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్, అపరిమిత కాలింగ్‌తో పాటు డిస్నీ + హాట్‌స్టార్‌కు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.
భారత్ ఫైబర్ రూ. 1,499 ప్లాన్..
సూపర్-ఫాస్ట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ అవసరం అయ్యే వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ రూ. 1,499 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 300 ఎమ్‌బిపిఎస్ బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తోంది. రూ .999 ప్లాన్‌తో లభించే అన్ని ఇతర ప్రయోజనాలతో పాటు యూజర్లు 4 టిబి డాటాను పొందుతారు.
Also read:
Lalu Prasad Yadav: ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలు.. ప్రస్తుతం ఎయిమ్స్‌లోనే బీహార్ నేత..