Video Viral: ఓ యువకుడు ప్రాణాపాయం కలిగించేలా బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్.. పోలీసులు శిక్ష.. ఎక్కడంటే

Keral police : ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ వింతలు విడ్డూరాలు కనిపించినా వెంటనే వాటిని చిత్రీకరించి..

Video Viral: ఓ యువకుడు ప్రాణాపాయం కలిగించేలా బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్.. పోలీసులు శిక్ష.. ఎక్కడంటే
Keralapolice
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2021 | 1:43 PM

Keral police : ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ వింతలు విడ్డూరాలు కనిపించినా వెంటనే వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. ఇక కొంతమందికి తాము అందరిలోనూ స్పెషల్ గుర్తింపు పొందాలనే తపనతో చేస్తున్న పనులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సోషల్ మీడియాలో తాము వైరల్ కావడానికి నేటి యువత అధిక సంఖ్యలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న విన్యాసాలు.. వారి ప్రాణాలను ప్రమాదంలో పడెయ్యడమే కాదు.. ఇతరుల ప్రాణాలకు ముప్పుని కలిగిస్తున్నాయి. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు బైక్ మీద చేసిన విన్యాసాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ యువకుడు రోడ్డుమీద బండి డ్రైవ్ చేస్తూ.. తనకు ఎదురుగా వస్తున్న కారు, ముందువరకూ వెళ్లి అప్పుడు సడెన్ గా ఆ కారునుంచి తప్పించుకుంటున్నాడు. అంతేకాదు.. బైక్ స్పీడ్ గా నడుపుతూ.. టిప్పర్ వ్యాన్ దాటి వెళ్ళిపోయాడు. ఇలా ప్రమాద కరమైన విన్యాసాలు చేసిన ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువకుడి బైక్ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయమని మోటారు వాహన విభాగానికి సూచించింది. దీంతో ఆర్టీవో ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేసింది.

టిప్పర్ ట్రక్ ను దాటడానికి ఆ యువకుడు.. ఓ కారు యజమాని ప్రాణాలు హాని కలిగించేలా బైక్ నడిపాడని పోలీసులు చెప్పారు. అందుకనే సదరు యువకుడిపై చర్యలు తీసుకోమని సూచించినట్లు చెప్పారు.

Also Read: తల తోక లేని వింతజంతువు అంటూ ఓ మహిళ హంగామా.. అసలు విషయం తెలిసాక నవ్వులే నవ్వులు

  సుశాంత్ మూవీ ‘నమో నమో శంకర’ సాంగ్‌కు ఏనుగు ఓ రేంజ్‌లో డ్యాన్స్.. వీడియో వైరల్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే