
గత కొన్ని రోజులుగా టెలికామ్ రంగంలో బీఎస్ఎన్ఎల్ దూకుడు ప్రదర్శిస్తోంది. జియో, ఎయిర్‌టెల్ సంస్థలకు పోటీగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ‘మాన్‌సూన్ ధమాకా’ పేరుతో ఒక కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పరిమిత కాల ఆఫర్ కింద, కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి నెల ఉచిత సేవలను అందిస్తోంది.
కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందే వారికి ఇన్‌స్టాలేషన్ రోజు నుంచి ఒక నెల పాటు ఎటువంటి ఛార్జీలు లేకుండా సేవలు లభిస్తాయి. ఈ ఉచిత సేవ ద్వారా, వినియోగదారులు BSNL క్వాలిటీ, స్పీడ్‌ను పరీక్షించుకోవచ్చు.ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారికి దాదాపు నెలన్నర సమయం ఉంది.
ఈ ఆఫర్ తో పాటు కంపెనీ రూ.449 ప్లాన్ కొనుగోలుపై మూడు నెలల పాటు రూ.50 డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ఒక వ్యక్తి రూ.499 ప్లాన్ కొనుగోలు చేస్తే.. రాబోయే మూడు నెలల పాటు రూ.100 డిస్కౌంట్ ఇవ్వనుంది.
ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండింటిలోనూ వినియోగదారులకు ఇలాంటి రీఛార్జ్ ఆఫర్ లేదు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలతో పోటీ పడటానికి బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఉచిత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్ మొదటి నెల వినియోగదారులకు ఉచిత సేవను అందించడమే కాదు.. బీఎస్ఎన్ఎల్ సేవలు ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. దీంతో పాటు రాబోయే నెలల్లో మీరు డిస్కౌంట్‌లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి