BSNL Lifetime Plan: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన కస్టమర్లకు షాకిచ్చింది. ఇది వరకు ఉన్న లైఫ్‌టైమ్ వ్యాలిడిటీని తొలగించింది. వినియోగదారులు రూ.107 ప్రీమియం చెల్లించి నిమిషం ప్లాన్‌లోకి మార్చింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది. అయితే లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అతి తక్కువ ధరల్లోనే చాలా మంది వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు లభించేవి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు షాకిచ్చినట్లయింది. వారంత కూడా ఇప్పుడు రూ.107 ప్లాన్‌లోకి మారనున్నారు. ఈ ప్లాన్‌లోకి మారితే కస్టమర్లకు ఉచిత బెనిఫిట్స్ అంటూ ఏమి ఉండవు.
90 రోజుల వ్యాలిడిటీతో..
లైఫ్‌టైమ్ వ్యాలిడిటీని రద్దు చేసి రూ.107ప్లాన్‌లోకి తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. అపరిమిత ఇన్‌కమింగ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌లో లభించే 10జీబీ డేటా కేవలం 30 రోజులే వ్యాలిడిటీ ఉంటుంది. 100 నిమిషాల ఔట్‌గోయింగ్ కాల్స్ కేవలం 24 రోజులే ఉండనుంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్‌ను మాత్రం 60 రోజుల పాటు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 3జీబీ ఉచిత డేటా లభిస్తుంది. ఢిల్లీ, ముంబై సహా ఏ నెట్‌వర్క్‌కు అయినా 100 నిమిషాల ఉచిత కాల్స్, వంద రోజుల పాటు నేషనల్ రోమింగ్‌తో లభించనుంది.
ఈ వార్షిక ప్లాన్‌లో భాగంగా ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2,399 వ్యాలిడిటీలో మరో 60 రోజులు పెంచింది. ఇప్పుడు ఈ ప్లాన్‌లో 425 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌లో ప్రతి రోజు 3జీబీ డేటా, రోజువారి డేటా ముగిసిన తర్వాత 80kbps వేగంతో అపరిమిత డేటా అందిస్తుంది.
ఇవి కూడా చదవండి: