
దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1కే నెల రోజుల వ్యాలిడిటీ గల కొత్త ప్లాన్ తెచ్చి యూజర్లకు దివాళి గిఫ్ట్ అందించింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా (BSNL Diwali Bonanza Offer ) పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ ఈ రోజు(అక్టోబర్ 15) నుంచి నవంబర్ 15 వరకూ అందుబాటులో ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ దివాళీ బొనాంజా పేరుతో వచ్చిన కొత్త ప్లాన్ ద్వారా కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. అలాగే నెల రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. దీంతోపాటు రోజుకి 100 ఎస్‌ఎమ్‌ఎస్ లు డైలీ 2జీబీ డేటా కూడా వస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ వాడాలనుకునేవాళ్లు ఉచితంగా సిమ్ పొందవచ్చు. దానికోసం దగ్గర్లోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ కు వెళ్లొచ్చు. లేదా రిటైలర్లను సంప్రదించవచ్చు.
ఇకపోతే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతూ పోతుంటే బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ధరలను తగ్గిస్తూ కస్టమర్లను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే 5జీ నెట్‌వర్క్‌ను కూడా లాంచ్ చేస్తామని బీఎస్ ఎన్ ఎల్ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ లో కూడా అడుగుపెడితే అప్పుడు కాంపిటీషన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి