BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌!

BSNL Best Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 5జీ కూడా త్వరలో రానుంది. వినియోగదారుల కోసం తక్కువ ధరల్లోనే ఎక్కవ వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌లను తీసుకువస్తోంది.బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు అందించడంలో..

BSNL Best Plan: అతి తక్కువ ధరల్లోనే 365 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌!

Updated on: Aug 12, 2025 | 12:59 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లను పెంచుకునే విధంగా ప్లాన్‌లను తీసుకువచ్చింది. గతంలో ప్రైవేట్‌ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌, వీలు తన టారీఫ్‌లను పెంచాయి. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ధరలను పెంచలేదు. దీంతో చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ బాట పట్టారు. అప్పటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 5జీ కూడా త్వరలో రానుంది.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులు సంబరపడే శుభవార్త.. వరుసగా 3 రోజులు పాఠశాలలు బంద్‌

అయితే వినియోగదారుల కోసం తక్కువ ధరల్లోనే ఎక్కవ వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌లను తీసుకువస్తోంది.బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం రూ.1,999 రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ను తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి: కొత్త కారు కొన్నారా? 1000 కి.మీ వరకు ఈ తప్పులు అస్సలు చేయకండి..

ఈ ప్లాన్‌లో 365 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండనుంది. అలాగేరోజువారీగా 1.64 జీబీ డేటా. మొత్తం 600 జీబీ డేటా ఉంటుంది. అలాగే ఏడాది పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది.

అలాగే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేవలం ఒక రూపాయికే 30 రోజుల అపరిమిత కాల్స్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇది కొత్తగా సిమ్‌ కొనుగోలు చేసేవారికి మాత్రమేనని ఈ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది బీఎస్‌ఎన్‌ఎల్‌.

ఇది కూడా చదవండి: E Challans: ఇదేందిరా నాయనా.. ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘన.. రూ.470 కోట్ల జరిమానా!

ఇది కూడా చదవండి: Viral Video: ఇదేం పోయే కాలం.. ఇలాంటి వాళ్లను ఏమనాలి బ్రో.. రీల్‌ కోసం చీరకే నిప్పటించుకుంది

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి