BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ ఝలక్.. అతితక్కువ ధరతో అదిరిపోయే ప్లాన్.. 336 రోజుల పాటు..

బీఎస్ఎన్ఎల్ మరో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. అతితక్కువ ధరతో 336 రోజుల వ్యాలిడిటీతో ఈ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల రీఛార్జ్ కాకుండా ఏడాది పాటు ఒకేసారి తక్కువ ధరలో రీఛార్జ్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

BSNL: ఎయిర్‌టెల్, జియోకు బీఎస్ఎన్ఎల్ ఝలక్.. అతితక్కువ ధరతో అదిరిపోయే ప్లాన్.. 336 రోజుల పాటు..
మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ అయితే, రోజువారీ డేటాతో అపరిమిత కాలింగ్ సౌకర్యం, దీర్ఘకాలిక చెల్లుబాటు కావాలనుకుంటే రూ.485 ప్లాన్ మీకు సరైనదని నిరూపించవచ్చు. ఈ ప్లాన్ తక్కువ ధరకే దీర్ఘకాలిక చెల్లుబాటు మరియు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.

Updated on: Aug 19, 2025 | 2:55 PM

బీఎస్ఎన్ఎల్.. కొత్త కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఓ వైపు ఎయిర్‌టెల్, జియో ధరల పెంపుతో చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఒక నెల పాటు నెట్ ఫ్రీ స్కీమ్ తీసుకరావడంతో పాటు ఫ్రీడమ్ ఆఫర్ పేరుతో రూపాయికే మొబైల్ రీఛార్జ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో మరో సరికొత్త ఆఫర్‌ను తెచ్చింది బీఎస్ఎన్ఎల్. ప్రతి నెల రీఛార్జ్ కాకుండా ఏడాది పాటు ఒకేసారి తక్కువ ధరలో రీఛార్జ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బీఎస్ఎన్ఎల్ 336 రోజుల చెల్లుబాటుతో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెట్ తక్కువగా వినియోగించే వారికి ఈ అద్భుతమైన ప్లాన్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ ప్లాన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బీఎస్ఎన్ఎల్ 1499 ప్లాన్ వివరాలు

రూ. 1499 రీఛార్జ్ ప్లాన్‌తో కంపెనీ 24జీబీ హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. డేటా పూర్తిగా అయిపోయాక నెట్ స్పీడ్ 40kbpsకి తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి ఓటీటీ సహా ఇతర ప్రయోజనాలు ఉండవు.

ప్లాన్‌ ఎందుకు ప్రత్యేకమైనది?

ఈ ప్లాన్ ముఖ్యంగా ఆఫీసులో ఇంట్లో వై-ఫై ఎక్కువగా ఉపయోగించే వారికి, మొబైల్ డేటా అవసరం తక్కువగా ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. నెలకు కేవలం రూ.130 కంటే తక్కువ ఖర్చుతో మీరు నిరంతర కాలింగ్, మెసేజింగ్ సేవలను పొందవచ్చు.

జియో, ఎయిర్‌టెల్‌ సంగతేంటి?

ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వద్ద స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం 336 రోజుల చెల్లుబాటుతో కూడిన ఇంత తక్కువ ధర ప్లాన్ అందుబాటులో లేదు. జియో కేవలం తన జియోఫోన్ వినియోగదారులకు మాత్రమే ఇలాంటి ప్లాన్‌ను అందిస్తోంది. కాబట్టి ధర, చెల్లుబాటు విషయంలో ఈప్లాన్‌కు ప్రస్తుతానికి మార్కెట్లో తిరుగులేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..