Stock Market: మండే మంట నుంచి కోలుకున్న మార్కెట్లు.. బుల్‌ కొత్త జోష్..

|

Dec 21, 2021 | 10:48 AM

బుల్‌ రంకెలేసేందుకు రెడీ అవుతోంది. సోమవారం రక్తపాతం నుంచి కోలుకుంది. నెమ్మదిగా పుంజుకుంది. మంగళవారం ఆరంభంలోనే పరుగును ప్రారంభించింది.

Stock Market: మండే మంట నుంచి కోలుకున్న మార్కెట్లు.. బుల్‌ కొత్త జోష్..
Stock Markets
Follow us on

బుల్‌ రంకెలేసేందుకు రెడీ అవుతోంది. సోమవారం రక్తపాతం నుంచి కోలుకుంది. నెమ్మదిగా పుంజుకుంది. మంగళవారం ఆరంభంలోనే పరుగును ప్రారంభించింది. మాంచి జోష్‌‌తో కొనసాగుతోంది. రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది స్టాక్‌ మార్కెట్లు. ఒకవైపు ఫెడ్‌ నిర్ణయాలు, మరోవైపు ఒమిక్రాన్‌ లాక్‌డౌన్‌ భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. ఒక దశలో సెన్సెక్స్‌ 1800 పాయింట్లకు పైగా కోల్పోయినా ఆ తర్వాత కాస్త కోలుకుంది. సోమవారం మార్కెట్లు సృష్టించిన నష్టం నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ్టి ట్రేడింగ్‌ను లాభాలకు శ్రీకారం చుట్టాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండటం సూచీల సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది.

దీంతో దళాల్ మార్కెట్లు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్‌ 403 పాయింట్లు ఎగబాకి 56,226 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 16,732 వద్ద కొనసాగుతున్నాయి.

విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, శ్రీ సిమెంట్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..

Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..