Bread, Biscuit Prices: గోధుమ ధర పెంపు: సామాన్యులపై ద్రవ్యోల్బణం ప్రభావం నిరంతరం పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్-డీజిల్, ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. త్వరలో బ్రెడ్, బిస్కెట్లు, పిండి ధరలు (Rates) కూడా పెరిగే అవకాశం ఉంది. 2022 సంవత్సరం ప్రారంభం నుండి రేట్లు 46 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు గోధుమ ధరలు 46 శాతం పెరిగాయి. ప్రస్తుతం, గోధుమలు మార్కెట్‌లో MSP కంటే 20 శాతం ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం ఎఫ్‌సీఐ గోధుమల కోసం ఓఎంఎస్ఎస్‌ను ప్రకటించలేదు. దీంతో కన్జూమర్లు కంపెనీలు వీటి ధరలు మరింత పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. వీటి ధరలు జూన్ నుంచి పెంపు ఉండే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. వర్షాకాలం సమీపిస్తుండటంతో స్నాక్స్ వంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్‌లో విద్యాసంస్థలు కూడా తెరుచుకుంటాయి. ఇక బ్రెడ్, బిస్కెట్ వంటి స్నాక్స్ ఐటమ్స్‌కు డిమాండ్ పెరుగుతున్నందున ధరలు పెరిగే అవకాశం ఉంది.
గత సంవత్సరం ప్రభుత్వం నుంచి గోధుమలు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ 70 లక్షల టన్నుల గోధుమలను సేకరించింది. ఇప్పటి వరకు ఓఎంఎస్ఎస్‌పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కంపెనీలు ధరలను పెంచనున్నాయి.
రేట్లు 10 నుండి 15 శాతం
గోధుమల ధరల పెరుగుదల కారణంగా బ్రెడ్, బిస్కెట్లు, బన్స్ వంటి పిండితో తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ధరలలో 10 నుండి 15 శాతం పెరుగుదల ఉందని భావిస్తున్నారు వ్యాపారవేత్తలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి