
సాధారణంగా పెట్టుబడికి మంచి రాబడి కావాలని ప్రతి పెట్టుబడిదారుడు కోరుకుంటూ ఉంటారు. అయితే పెట్టుబడి విషయంలో నిర్దిష్ట సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం బాలికలు, మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాలను ప్రారంభించింది. సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పేరుతో మహిళలను పెట్టుబడి వైపు ప్రోత్సహించేందుకు రెండు పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. నిర్దిష్ట ప్రయోజనాలతో రూపొందించిన ఈ రెండు పథకాల లక్ష్యం మహిళా సాధికారతకు ఆర్థిక సాధికారత సాధించడంతో పాటు వారికి పొదుపు, పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాల్లో పెట్టుబడితో ఎంత మేరకు రాబడి వస్తుంది? ఈ రెండు పథకాల్లో ఏ పథకం పెట్టుబడికి అనుకూలం వంటి విషయాలను తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది యూనియన్ బడ్జెట్ 2023లో ప్రకటించిన చిన్న పొదుపు పథకం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ మార్చి 2025 వరకు రెండేళ్లపాటు అందుబాటులో ఉంటుంది. ఇది 2 సంవత్సరాల కాలవ్యవధికి మహిళలు లేదా బాలికల పేరిట రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పాక్షిక ఉపసంహరణ ఎంపికతో 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలవ్యవధికి మహిళలు లేదా బాలికల పేరిట రూ. 2 లక్షల వరకు డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్వల్పకాలానికి మహిళ పేరిట పెట్టుబడి పెట్టే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (ఎఫ్‌డి) సరైన ప్రత్యామ్నాయమని నిపుణులు భావిస్తున్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అందుబాటులో ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు పన్ను ప్రయోజనాలను అందించడం ద్వారా బాలికలకు సుసంపన్నమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సుకన్య సమృద్ధి పథకం అనేది భారత ప్రభుత్వానికి సంబంధిచిన చిన్న డిపాజిట్ పథకం, ఇది ప్రత్యేకంగా ఆడపిల్ల కోసం ఉద్దేశించి రూపొందించారు. ఈ పథకం ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఉద్దేశించబడింది. బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం (సేవ్ డాటర్, ఎడ్యుకేట్ డాటర్)లో భాగంగా 2015లో ప్రారంభించబడిన ఇది 8.2 శాతంవడ్డీ రేటును అందిస్తుంది, ఇది ఏటా కలిపి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..